ఇవాళ ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సుని ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ నుంచి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొంటారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొంటారు. సదస్సులో న్యాయస్థానాల్లో ఐటీ వినియోగం,…
గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పై సీజేఐగా జస్టిస్ ఎన్వీ.రమణకు ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే ఎన్నో రోజులుగా పరిష్కారంకాని సమస్యలను పరిష్కరించారన్నారు. ‘ఉమ్మడి హైకోర్టు విడిపోయాక బెంచీల సంఖ్య పెంపుపై గతంలో కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖ రాశాను. కానీ.. ఆ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది’. ‘సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక…
న్యాయస్థానాల పట్ల ప్రభుత్వాలు వ్యవహరించే తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు వెలువరించే తీర్పులు, వ్యక్తం చేసే అభిప్రాయాలు తమకు అనుకూలంగా రాకపోతే ప్రభుత్వాలు న్యాయమూర్తులను కించపరుస్తున్నారని.. ఇది దురదృష్టకర పరిణామం అని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. గతంలో ప్రైవేట్ పార్టీలు మాత్రమే ఇలా వ్యవహరించేవి అని ఆయన గుర్తుచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ఆమన్‌కుమార్‌పై నమోదైన కేసును ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసింది.…
CJI NV Ramana Visit Today Srisailam Temple. నేడు కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా విచ్చేయనున్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారిని, అమ్మవారిని ధూళి దర్శనం చేసుకోనున్నారు. రాత్రి బస చేసి.. సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సీజేఐ రాక నేపథ్యంలో ఏపీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కంచిమఠంలో జరిగే హోమ పూర్ణాహుతిలో…
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. అయితే రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులు, కుటుంబాల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మాత్రం సుప్రీంకోర్టు ప్రశంసించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంచి చర్యలే చేపడుతోందని, దానిపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని సీజేఐ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తిగానే ఉన్నాయని…
హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్లకు హాజరుకావొద్దంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముస్లిం విద్యార్థులు సవాల్ చేశారు. అయితే హిజాబ్ అంశంపై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడతామని…
ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు ఒక మిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.. ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు పర్యటించారు.. సీజేఐ హోదాలో తన సొంత గ్రామంలోనూ అడుగుకుపెట్టారు.. ఆ తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. తన పర్యటన ముగిసిన తర్వాత.. తన టూర్‌పై రాష్ట్ర ప్రజలకు బహిరంగలేఖ రాశారు జస్టిస్ ఎన్వీ రమణ.. ఏపీలో కాలు మోపినప్పటి నుంచి నాకు లభించిన ఆదరాభిమానాలు.. ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తీరును నేను నా కుటుంబ సభ్యులు ఎన్నటికీ మరువలేమన్న ఆయన.. బంధుత్వాలకంటే…
ఏపీ పర్యటనలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను జడ్జిలే నియమిస్తారని భావించడం ఓ భ్రమ అని సీజేఐ వ్యాఖ్యానించారు. మిగతా వ్యవస్థల తరహాలో న్యాయవ్యవస్థ కూడా ఓ పావు లాంటిదేనన్నారు. జడ్జిల నియామకాల్లో చాలా మంది పాత్ర ఉంటుందని.. జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని సీజేఐ తేల్చి చెప్పారు. జడ్జిల…