ఏపీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఇచ్చారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ వర్గాలు సాదర స్వాగతం పలికాయి. కాగా శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎన్వీ రమణకు…
ఆయేషా మీరా తల్లి సీజేఐ ఎన్వీ రమణకు బహిరంగ లేఖ రాశారు. 14 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం లేదని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు మధ్యలోనే ఎందుకు ఆపివేసారో తెలియడం లేదన్నారు. నేరస్థులు ఎవరో తెలిసినా దర్యాప్తు సంస్ధలు పట్టుకోలేని స్ధితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలో న్యాయం జరగదని మీరు ఆమోదముద్ర వేస్తే మూగజీవాలుగా మిగిలిపోతామని లేఖలో అయేషా మీరా తల్లి పేర్కొన్నారు. ఇదిలా వుండగా… సీజేఐ జస్టిస్ ఎన్వీ…
ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నోవోటెల్ హోటల్‌లో తన భార్య భారతితో కలిసి జగన్ సీజేఐను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి సీజేఐతో జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతకుముందు క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పర్యటనకు కడప జిల్లా వెళ్లిన జగన్ ఈరోజు మధ్యాహ్నమే విజయవాడకు చేరుకున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ…
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు ఆయన సొంతూరులో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పొన్నవరం ఆయన స్వగ్రామం. అయితే ఆయనను గ్రామస్థులు ఎడ్లబండిపై ఊరేగింపు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల అభినందన సభలో మాట్లాడుతూ.. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోను.. నేను పుట్టిన ఊరంటే నాకు చాలా ఇష్టమని ఆయన అన్నారు. చిన్నతనంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 1967లోనే రాజకీయంగా చైతన్యమైన గ్రామం మాది.…
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ్ నేడు సొంతూరులో పర్యటిస్తున్నారు. కృష్ణ జిల్లాలోని పొన్నవరం ఆయన స్వగ్రామం. అయితే సీజేఐ హోదాలో మొదటి సారి ఆయన స్వగ్రామానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనను ఎండ్లబండిపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతేకాకుండా కాకుండా ఆయన గ్రామస్థుల అభినందన సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీజేఐ సొంతూరు పర్యటనను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి.
తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు.. శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.. కోర్టుల్లో మౌలిక వసతులు ఉంటేనే పేదలకు న్యాయ సేవలు అందుతాయన్న ఆయన.. మౌలికవసతులు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు పని చేయాలని అనుకోవడం దురాశ…
వరంగల్ లో మూడు సాహిత్య పాఠశాలలకు హాజరయ్యాను. వరంగల్ లో బంధువులు, మిత్రులు ఉన్నారు. వరంగల్ తో నాకు అవినాభావ సంబంధం ఉంది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వరంగల్ కోర్టు బిల్డింగ్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ… వరంగల్ పోరాట గడ్డ. విప్లవకారులు తిరిగిన నేల. దేశానికి ప్రధాన మంత్రిని అందించిన ప్రాంతం వరంగల్ అని తెలిపారు. పొరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం, వరంగల్ కు…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు సందర్భాల్లో పర్యటిస్తున్న ఆయన.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. ప్రస్తుతం తెలంగాణలో ఆయన పర్యటన కొనసాగుతుండగా… త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో సీజేఐ పర్యటన కొనసాగనుంది.. సీజేఐగా తొలిసారి తన స్వగ్రామంలో అడుగుపెట్టనున్నారు.. Read Also: దళితబంధు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ 3 రోజుల పాటు పర్యటించనున్నారు.. ఈ…
హైదరాబాద్ కు తలమానికమయిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ప్రారంభం అయింది. నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు – సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమా కోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్…