Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది సీఐడీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయటం కోసం సమయం కోరారు సీఐడీ పోలీసులు.. ఈ కేసులో ఏ71గా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్.. అయితే, బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి సీఐడీ కోర్టు వాయిదా వేయడంతో.. మరోసారి వల్లభనేని వంశీ మోహన్‌కు షాక్ తగినట్లు అయ్యింది..
Read Also: Tamil Nadu: ‘‘మోక్షం’’ పేరుతో ఫ్రెంచ్ మహిళపై లైంగిక దాడి.. అరుణాచలంలో గైడ్ అఘాయిత్యం..
కాగా, వల్లభనేని వంశీ మోహన్‌కు మంగళవారం రోజు మరోషాక్ తగిలింది.. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు.. అంటే.. రిమాండ్‌లో మరో రిమాండ్ విధించింది.. కాగా, కబ్జా కేసులో వల్లభనేని వంశీ మోహన్‌పై నమోదైన కేసులో కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇవ్వటంతో గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరిచారు పోలీసులు.. విజయవాడ సబ్‌జైలులో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుని.. గన్నవరం తరలించిన ఆత్కూరు పోలీసులు.. గన్నవరం కోర్టులో వల్లభనేని వంశీ మోహన్‌ను హాజరుపరిచారు.. అయితే, ఆత్కూరు పీఎస్‌లో నమోదైన భూ కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు గన్నవరం కోర్టు రిమాండ్ విధించిన విషయం విదితమే..