కొత్త సంవత్సరం వేళ తన యూజర్లకు బీఎస్ఎన్ ఎల్ గుడ్ న్యూస్ అందిచింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ BSNL తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక పండుగ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ప్రమోషన్ కింద, వినియోగదారులు నాలుగు నిర్దిష్ట ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అదనపు రోజువారీ డేటాను పొందుతారు. డేటా అధికంగా ఉపయోగించే వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండనున్నాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ఈ పరిమిత కాల ఆఫర్ డిసెంబర్ 24, 2025…
క్రిస్మస్ పండగ వేళ కాలిఫోర్నియాను భారీ వరదలు ముంచెత్తాయి. తుఫాను కారణంగా కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఇక నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. ఇక వరదలు కారణంగా క్రిస్మస్ సందడి కాస్త చప్పబడిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు.
క్రిస్మస్ సందర్భంగా భవిష్ అగర్వాల్‌కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 4000కు చేరింది. ఓలా భారతదేశపు అతిపెద్ద ఈవీ పంపిణీదారు కంపెనీగా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా తెలిపారు.
Zomato: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘‘జొమాటో’’ డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ దుస్తులను ధరించి ఆర్డర్లను ఇవ్వడంపై హిందూ గ్రూప్ ప్రశ్నల్ని లేవనెత్తింది. శాంటాక్లాజ్ దుస్తుల్లో డెలివరీ ఏజెంట్‌ని నిలదీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూయేతర పండగల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంభిస్తుందని జొమాటోపై హిందూ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి.
Mary Millben: అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ అభిమానిగా పేరుగాంచిన ఆఫ్రికన్-అమెరికన్ సింగర్, నటీ మిల్‌బెన్ మంగళవారం మోడీకి క్రిస్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక కార్యక్రమంలో ఏసుక్రీస్తును గౌరవించినందుకు ప్రశంసించారు.
Harish Rao : క్రిస్మస్‌ను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ప్రతి క్రిస్మస్‌కు పేద క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్‌లు అందించడం ప్రత్యేకమైనది అని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులపై కేసీఆర్ చేసిన ప్రయత్నాలు, ఎంత బాగా చూసుకున్నారో అందరికీ తెలుసని చెప్పారు. మెదక్ చర్చి వందేండ్లు పూర్తి అవడాన్ని పురస్కరించుకుని హరీష్ రావు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…
క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్‌కు ముందు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చర్చిలను అలంకరించారు. ఈ నేపథ్యంలో ఓ చర్చిపై 'ఆలయం'(మందిర్) అని రాశారు. దీనికి హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త వివాదం తలెత్తింది.