Congo: కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడటంతో 38 మంది మరణించిన ఘటలో 100 మందికి పైగా తప్పిపోయారని అధికారులు చెప్పుకొచ్చారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తుండటంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అయితే, ఫెర్రీ బోటులో 400 మందికి పైగా ప్యాసింజర్లు ఉన్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. వారంతా క్రిస్మస్ వేడుకల కోసం సొంతూళ్లకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం నెలకొందని చెప్పారు. ఇక, గల్లంతైన వారిలో ఇప్పటి వరకు 20 మందిని రక్షించగా.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.
Read Also: Game Changer : కింగ్ మాదిరి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్
అయితే, ఫెర్రీ బోటు సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం సైతం ఓ నదిలో పడవ బోల్తా పడి దాదాపు 25 మంది వరకు చనిపోయారు. ఈ క్రమంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించొద్దని అక్కడి అధికారులు ఎప్పటికప్పుడు పడవల నిర్వహాకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు వాటిని పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు కొనసాగుతున్నాయి.