Andhra Pradesh: ఈనెల 25న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు విజయవాడలో ప్రభుత్వం ప్రత్యేకంగా క్రిస్మస్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు. వేదికపై ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ఇతర నేతలు ఆశీనులు అయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. Read Also: Pakistan: ఇంగ్లండ్ చేతిలో క్లీన్…
హైదరాబాద్‌లోని చందానగర్‌లో గల చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ క్రిస్మస్ వేడుకల్లో బిగ్‌బాస్ ఫేం హిమజ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన చిన్నతనంలో క్రిస్మస్ వేడుకల జ్ఞాపకాల గురించి పంచుకున్నారు.
అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పండుగలకు అండగా నిలుస్తున్నారు. ఈ కానుకలతోపాటు ప్రభుత్వం రూ. 6 లక్షలు, జిల్లాకు రూ. ఈస్ట్ ఫెస్ట్ నిర్వహించేందుకు ప్రత్యేక నియోజకవర్గానికి 2 లక్షలు. కాగా.. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు.
మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే వెంటనే పూర్తి చేయండి. నవంబర్ నెల ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 2022లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ వచ్చే నెలలో అంటే డిసెంబర్‌లో 13 రోజుల సెలవులు ఉండబోతున్నాయి.
షూటింగ్ల సమయంలో ఎవరు ఎలా ఉన్నా పండగ వేళ అందరు కలుసుకోవడం మెగా ఫ్యామిలీకి ఉన్న గొప్ప అలవాటు. పండగ ఏదైనా అందరు కలిసి చిరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక క్రిస్టమస్ వచ్చిందంటే మెగా కజిన్స్ అందరు ఒకచోట చేరి రచ్చ చేయడం మామూలే.. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నా ఈ సాంప్రదాయం ఈ ఏడాది కూడా కొనసాగింది. క్రిస్టమస్ వేడుకలలో దిగిన మెమొరీస్ ని స్వీట్ మెగా డాటర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ…
వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా వీడియోలు పోస్ట్ చేసే వారిలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆయన సోస్ట్ చేసే వీడియోలు తప్పకుండా వైరల్ అవుతుంటాయి. తాజాగా క్రిస్మస్ వేడుకలపై ఓ వీడియోను పోస్ట్ చేశారు. లక్షల పదాల కంటే చిన్న వీడియో చాలా శక్తివంతమైనదని, హంగు ఆర్బాటం, ఆడంబరాలు లేకున్నా పిల్లలు చేసుకుంటున్న క్రిస్మస్ వేడుకలు చాలా గొప్పవని అన్నారు. ఆఫ్రికా ఖండంలోని పిల్లలు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా క్రిస్మస్ వేడుకలను…
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. వాస్తవానికి ఇది క్రిష్టియన్స్ పండగ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అన్ని పండగలను అందరూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. డిసెంబర్ నెల వచ్చిందంటే పండగల కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రిస్మస్ మొదలుకొని వరుసగా న్యూఇయర్, సంక్రాంతి సెలెబ్రేషన్స్ కూడా అతి తక్కువ గ్యాప్ తో సెలెబ్రేట్ చేసుకుంటాం. ప్రస్తుతం అందరూ క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయారు. సెలెబ్రిటీలు సైతం తమ ఇంటికి లైట్స్ తో, క్రిస్మస్ ట్రీతో, శాంటా బొమ్మలతో అలంకరించి…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియ చేశారు. మానవత్వాన్నిచాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనగమనం, నేటికీ అందరికీ ఆచరణీయమని అని సిఎం అన్నారు. క్రిస్మస్ సందర్భంగా అటు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా…
క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని పేర్కొన్నారు సీఎం జగన్.. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా…