జూన్ లో వస్తున్న ఈ నాలుగో శుక్రవారం తెలుగు సినిమాలు చాలానే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. విశేషం ఏమంటే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కొండా మురళీ, సురేఖ బయోపిక్ ‘కొండా’ గురువారం రోజే విడుదలైంది. గత కొన్ని నెలలుగా వర్మ చిత్రాల విడుదలకు చెక్ పెడుతూ వస్తున్న నట్టికుమార్ ఇప్పుడు అతనితో చేతులు కలపడంతో ‘కొండా’ విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక శుక్రవారం మరో ఎనిమిది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్…
మన టాలీవుడ్‌లో మంచి కామిక్ టైమింగ్ ఉన్న నటుల్లో విశ్వక్ సేన్ ఒకడు. సందు దొరికితే చాలు.. సెటైరికల్ పంచ్‌లతో గిలిగింతలు పెట్టించేస్తాడు. లేటెస్ట్‌గా చోర్ బజార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ ఇతను ఏకంగా యాంకర్ ఉదయ భానుపైనే ఛలోక్తులు పేల్చి నవ్వులు పూయించేశాడు. ఈ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్‌ను ఉదయ భాను వేదిక మీదకి పిలిచింది. అతడు రాగానే, సినిమాల్లో కన్నా రియల్‌గానే చూడ్డానికి చాలా బాగున్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చింది. అప్పుడు విశ్వక్ సేన్…
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటించిన ‘చోర్ బజార్’ మూవీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. దాంతో ఈ మూవీని సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు మాస్ మహరాజా రవితేజ. ఈ చిత్రంలోని ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ లిరికల్ సాంగ్ ను ఆయన తాజాగా విడుదల చేశారు. రవితేజ కూడా అమితాబ్ అభిమానే కావడం విశేషం. ఆయన తన సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్ చెబుతుంటారు. పూరీ ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అటు తన ఫేవరేట్ స్టార్…
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లందరూ రీ ఎంట్రీల మీద పడ్డారు. ఒకప్పుడు తమ అందం, అభినయాలతో అలరించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు స్టార్ హీరోలకు అమ్మలుగా, అత్తలుగా కనిపించి మెప్పిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి లిస్టులోకి చేరిపోయింది సీనియర్ నటి అర్చన. నిరీక్షణ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అర్చన భారత్ బంద్, లేడీస్ టైలర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందులో ఆమె నటించిన తీరు…