Chlorine gas leak in Uttarakhand: ఉత్తరఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. డెహ్రాడూన్‌కు సమీపంలోని ఝంజ్రాలో క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సహాయక చర్యలతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్…