చిత్తూరులో వివాహిత అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. పరువు హత్య కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన యాస్మిన్ భాను 3 నెలల క్రితం పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజను ప్రేమ పెళ్లి చేసుకుంది. యాస్మిన్ భాను, సాయితేజ్ గత ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అదే నెల 13న తిరుపతి రూరల్ పోలీసులను ప్రేమజంట ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువతిని సాయితేజ…
అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించారు. ప్రతిపక్షానికి పరిమితం అయినా…అదే గ్రూపులు మెయింటెన్ చేస్తున్నారు. కలిసికట్టుగా పని చేయాల్సిన నేతలు…వర్గాలుగా విడిపోవడంపై సొంత పార్టీ నేతలు కస్సుమంటున్నారు. కేసులు…అరెస్టు భయాలు వెంటాడుతున్న నీ గురించి నేను మాట్లాడను…నా గురించి నువ్వు మాట్లాడొద్దు అనేలా వ్యవహరం మారిపోయింది. ఇంతకీ ఎవరా నేతలు ? ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2019లో 14 స్థానాలకు 13 స్థానాల్లో గెలిచింది. పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించిన జిల్లా…
పేరుకు రాష్ట్ర మంత్రి అయినా… ఆయన్ని ఆ జిల్లాలో పట్టించుకునే వాళ్ళే లేరా? ప్రత్యేకించి తాను ఇన్ఛార్జ్ మినిస్టర్‌గా ఉన్న జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే… ఎవరయ్యా నువ్వు అన్నట్టుగా ఉంటున్నారా? ఎమ్మెల్యేల తీరుతో అమాత్యులవారి ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరుతోందా? ఛీ…… డ్యాష్‌లో జీవితం అనుకుంటున్న ఆ మంత్రి ఎవరు? ఎందుకంత దారుణంగా మారిపోయింది పరిస్థితి? చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిపై ఉమ్మడి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారట. దాన్ని…
చిత్తూరు జిల్లాలో నలుగురు విఆర్ఓలను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భాగంగా పరిష్కారమైన అర్జీదారుల స్పందనను ఐవిఆర్ ఎస్ ద్వారా ప్రభుత్వం సేకరిస్తోంది. సమాచార సేకరణలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ కఠినమైన చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా సిటిజెన్ ఫీడ్ బ్యాక్ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా సస్పెండ్ అయిన వీఆర్వోల్లో బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి విఆర్వో, ఎస్ ఆర్ పురం నెలవాయి విఆర్వో, గంగవరం మండలం…
ఆ ఉమ్మడి జిల్లాలో తగ్గదే…లే… అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. మీరు మర్చిపోదామనుకున్నా… మేం పోనివ్వమంటూ… సోషల్ మీడియా తవ్వకాలు జరిపి పాత వీడియోల్ని వెదికి పట్టుకుని మరీ కొత్తగా సర్క్యులేట్ చేస్తున్నారట. నాడు మమ్మల్ని ఓ ఆటాడేసుకున్న వాళ్ళని అంత తేలిగ్గా వదులుతామా అని అంటున్నారట. ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? టీడీపీ లీడర్స్ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? పవర్‌లోకి వచ్చాక పగ…పగ… అని రగిలిపోతున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,…
చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పుల పాలైన ఓ ప్రముఖ వ్యాపారి.. మరో ప్రముఖ వ్యాపారి ఇంట్లో దోపిడీకి పన్నాగం పన్నాడు. దొంగతనం చేయడానికి స్థానికంగా చిత్తూరులో ఉంటున్న ఏడుగురుతో ఒప్పందం కుదుర్చుకుని.. ప్లాన్ అమలు చేశాడు. డమ్మీ గన్నుతో బెదిరించి.. డబ్బు దోచుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు ప్లాన్ బెడసికొట్టి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్తూరులో ఎస్‌ఎల్‌వీ ఫర్నిచర్ షోరూం యజమాని సుబ్రహ్మణ్యం అప్పుల పాలయ్యాడు.…
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మార్చ్ 1వ తేదీన) చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
Prism Pub Firing Case : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ప్రభాకర్.. ప్రభాకర్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్, బాన్సర్లు గాయపడ్డ. స్పాట్‌లోనే ప్రభాకర్ నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకన్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకి స్వాధీనం చేసుకున్నారు. మల్టీ…
చిత్తూరు శివారు ప్రాంతం గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న టిప్పర్ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు సీఎంసీ, నరివి ఆస్పత్రులకు తరలించారు. ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం 20 అడుగులు జారుకుంటూ రోడ్డు…
చిత్తూరు జిల్లాలో పండగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి కరిష్మా (27) పరిస్థితి విషమంగా ఉంది.