అధికారం కోల్పోయాక ఏ ఒక్క నేతా ఆ నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడలేదట. ఉన్న కొందరూ నచ్చిన దారిని ఎంచుకున్నారు. పార్టీనే నమ్ముకున్నవారి పరిస్థితి ఏంటన్నది టీడీపీ తమ్ముళ్ల ఆవేదన. ప్రస్తుతం దిక్కులేకుండా పోయామని వాపోతున్నారట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? దిక్కులేకుండా పోయామని చిత్తూరు తమ్ముళ్ల ఆవేదన! అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ స్థితి దయనీయంగా ఉందన్నది కేడర్ ఆవేదన. జిల్లా కేంద్రమైన…
ఒకరు చేతికి ఉంగరం పెట్టుకున్నారు. ఇంకొకరు కనిపించిన దేవుడికి మొక్కుతున్నారు. ఏకంగా గుడే కట్టించేశారు మరొకరు. వీటన్నింటికీ మూల మంత్రం ఒక్కటే. రేస్‌లో ముందుకెళ్లడమే. కొత్త పదవి చేపట్టడం.. లేదా ఉన్న పదవిని కాపాడుకోవడం. ఆ జిల్లాలో అధికారపక్ష నేతలు చేస్తున్న ఈ విన్యాసాలే ఇప్పుడు ఆసక్తిగా మారాయి. సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యం? దేవుడు కరుణించాలి. వరాలు కురిపించాలి. సామాన్య భక్తులు ఈ ఆశతోనే గుళ్లకు వెళ్తారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. రాజకీయ నాయకులైతే…
కలియుగంలో ఎక్కడ ఎలాంటి వింతలు జరుగుతాయో తెలియడంలేదు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా అన్ని వింత వింతలు జరుగుతున్నాయి. మనుషులు పాల కోసం ఆవులను పెంచుతుంటారు. కొన్ని ఆవులు ఎంత పితికినా పాలు ఇవ్వవు. కొన్ని వద్దన్నా పాలు ఇచ్చేస్తుంటాయి. అయితే, ఈ ఆవు మాత్రం అన్నింటికంటే స్పెషల్. ఈ ఆవు పొదుగును పితక్కపోయినా పాలు ఇచ్చేస్తుంది. ఈ విషయాన్ని ఆ ఆవు యజమాని వెంకటరమణారెడ్డి పేర్కొన్నాడు. చిత్తూరు జిల్లాలోని వడమాల మండలంలోని నెన్నూరు వెంకటరెడ్డి కండ్రిగ గ్రామంలోని వెంకటరమణారెడ్డికి…
ఏదైనా సమస్య వస్తే నాయకుడి దగ్గరకు కేడర్ వెళ్లడం సాధారణం. పార్టీ పవర్‌లో ఉన్నా.. లేకపోయినా.. శ్రేణులకు అందుబాటులో ఉన్న నేతలే దేవుళ్లు. ఆ జిల్లాలో మాత్రం కేడర్‌ను, పార్టీని పట్టించుకునే వాళ్లు లేరు. తమ్ముళ్లు దిక్కులేని వారిగా మారిపోయారు. అధినేత ఎప్పుడు కరుణిస్తారా అని రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో దిక్కులేకుండా పోయిన టీడీపీ కేడర్! చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు ఈ దఫా పెద్దకష్టమే వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత…
నామినేటెడ్ పోస్టుల పందేరం ముగియడంతో ఎమ్మెల్యేల ఫోకస్.. కేబినెట్ బెర్త్‌లపై పడింది. రెండున్నరేళ్ల ప్రక్షాళన గడువు దగ్గర పడేకొద్దీ.. తాడేపల్లి వైపు ఆశగా చూస్తున్నారు. కేబినెట్‌లో ఉన్నవారు టెన్షన్ పడుతుంటే.. కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఈ అంశమే హాట్ టాపిక్. తాడేపల్లి వైపు ఆశగా చూస్తోన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో 13 చోట్ల గెలిచింది వైసీపీ. ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. ఇద్దరికి జిల్లా…
చిత్తూరు జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ జిల్లాలో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ జిల్లా నుంచే మరణాలు కూడా అధికంగా సంభవించాయి. ఇక ఇదిలా ఉంటే, జిల్లాలోని గుడియానంపల్లిలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 31 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Read: చిత్రసీమలో యోగసాధన! ఆ గ్రామంలో తొలిడోస్‌గా కోవీషీల్డ్ తీసుకున్న వారికి మెగా డ్రైవ్‌లో భాగంగా రెండో డోస్‌గా కోవాగ్జిన్ ఇచ్చారు. ఏఎన్ఎం తప్పిదం కారణంగా…
ఆమె ఓ ప్రజాప్రతినిధి. నగర ప్రథమ మహిళ. నగరంలో తొలి గౌరవం ఆమెకే దక్కాలి. కానీ.. అక్కడ ఆ సీన్ లేదట. కార్యాలయ సిబ్బంది సైతం ఆమెను పట్టించుకోవడం లేదని టాక్. దీంతో పెద్ద పదవిలో ఉన్నా.. తగినంత గౌరవం దక్కడం లేదని లోలోన ఆవేదన చెందుతున్నారట ఆ మహిళా ప్రజాప్రతినిధి. ఇంతకీ ఎవరామె? చిత్తూరులో మేయర్‌ను పట్టించుకోని పార్టీ నేతలు ఎస్. అముద. చిత్తూరు మేయర్. రాజకీయాలకు కొత్త. పొలిటికల్ ఎంట్రీలోనే కార్పొరేటర్ అయ్యారు. రిజర్వేషన్…
ఈ ఏడాది మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమా హిట్ తో వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. క్రాక్ తరువాత ఆయన నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. రమేశ్ వర్మ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పునప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత రవితేజ తన తదుపరి చిత్రాన్ని శరత్ మండవ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందులో ఆయన చిత్తూరు యాసలో మాట్లాడతారని…
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలో నర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయమ్మ అనే మహిళ బ్లాక్ ఫంగస్ బారిన పడింది. దీంతో ఆమెను తిరుపతి స్విమ్స్‌లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి పద్మావతి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న జయమ్మ, మెడికల్ వార్డులోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వార్డులో మిగతా రోగుల్లో భయాంధోళనలకు గురయ్యారు. బ్లాక్ ఫంగస్ సోకిందనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదంటే మరేమైనా…
చిత్తూరు జిల్లాలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులతో పాటుగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 135 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో 67, స్విమ్స్ లో 70 కేసులను నిర్ధారించారు. ఇక బ్లాక్ ఫంగస్‌తో ఇప్పటి వరకు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. బ్లాక్ ఫంగస్ కు మందుల కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో రోగులకు అరకొరగా వైద్యం అందుతున్నది. చిత్తూరుతో పాటుగా మిగతా జిల్లాల్లో…