Red Sandal Smuggling: తగ్గేదే లేదన్న వైసీపీ నేత.. వదిలేదే లేదంటూ పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP Leader Nagabhushanam Arrested In Red Sandal Smuggling: ‘పుష్ప’ సినిమా తరహాలోనే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయాలని చూసిన వైసీపీ నేత ఒకరు అడ్డంగా దొరికిపోయారు. ఈ స్మగ్లింగ్ విషయం తెలుసుకున్న పోలీసులు.. కాపు కాచి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ నేతతో పాటు మరో ఎనిమిది మందిని సైతం అరెస్ట్ చేశారు. ఆ నేత పేరు నాగభూషణం. చంద్రగిరి మండలం, అరిగెలవారిపల్లెకు చెందిన ఆయన.. కడప జిల్లా, ఒంటిమిట్ట మండలం, సర్వకాటపల్లి గ్రామం, యల్లాపుల్లల బావికొండల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆ నేతను అరెస్ట్ చేశారు. ఆ నేతతో పాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 49 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను కడప సబ్ జైలుకు తరలించారు.
ఈమధ్య ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే.. కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు కూడా సినీ ఫక్కీలో స్మగ్లర్లు పోలీసుల ముందు నుంచే తరలించే ప్రయత్నం చేసిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో.. గంగాధర నెల్లూరు మండలం ముష్టిపల్లి వద్ద రోడ్డుపై ఒక ఆగి ఉన్న వాహనం కనిపించింది. రిపేర్ వచ్చిందేమో సహాయం చేద్దామని దగ్గరికి వెళ్లి చూస్తే.. లోపల ఎర్రచందనం దుంగలు కనిపించాయి. స్మగ్లర్లు పారిపోయేందుకు ప్రయత్నించారు కానీ, వారిని చేజ్ చేసి పట్టుకున్నారు. రెండు వాహనాలను, 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!