Chittoor Fire Accident: ఘోర ప్రమాదం.. ఆ నిర్లక్ష్యం ఖరీదు మూడు ప్రాణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి జరిగిన ప్రమాదం కంటే.. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యాలు ప్రాణాలు పోయేందుకు కారణం అవుతాయి. చిత్తూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతికి అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం కారణంగా చెబుతున్నారు స్థానికులు… మంటలు ఎగసి పడుతుంటే అగ్నిమాపక శాఖ ఆలస్యంగా రావడం ఒక కారణం కాగా, తెచ్చిన సగం నీళ్ళు అయిపోయాయి. దీంతో నీటిని పట్టుకుని వస్తామని అగ్నిమాపక శాఖ సిబ్బంది చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్దానికులు… వారి నిర్లక్ష్యం కారణంగానే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారంటున్నారు.
స్థానికులైన తాము కిటికీలు పగులగొట్టి ప్రయత్నం చేశామే గాని వారు మాత్రం రాలేదంటున్నారు. అసలు చిత్తూరు అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతికి కారణం ఎవరు? చిత్తూరు నగరంలోని రంగాచారి వీధిలో పేపర్ ప్లేట్లు తయారీ భవనంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భవనంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంట్లలో చిక్కుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతుల్లో తండ్రి ,కొడుకుతో పాటు స్నేహితుడున్నాడు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందంటున్నారు.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
Read Also: AP Assembly Last Day: ఇవాళ్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అక్కడే వున్న స్థానికులు ప్రమాదం గురించి తెలుసుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన భవనం గోడలు పగులగొట్టి స్పృహ కోల్పోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు చనిపోయారని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని భాస్కర్ (65), ఢిల్లీ బాబు (35) బాలాజీ (25)గా గుర్తించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కావడంతో విషాదం నెలకొంది.
Read Also: Gujarat: 15 ఏళ్ల బాలుడిని చంపేసిన సింహాలు..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!