molestation case: ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. సాంకేతిక అభివృద్ధితో ప్రపంచం దూసుకుపోతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మానవుడు ఇంకా అనాగరికుడిగానే మిగిలిపోయాడా అన్న సందేహం కలుగకమానదు. సంప్రదాయాలకు, కుటుంబ బంధాలకు విలువ నిచ్చే దేశంలో కొంతమంది కీచకుల వల్ల తలవంచుకుని నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మానవ బంధాలను, వావివరసలు మరిచి నీచులు ప్రవర్తిస్తున్నారు. కన్న కూతుర్లను, తోటి సోదరులను చెరుస్తూ సమాజంలో చీడపురుగులుగా చెలరేగిపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కామాంధుడైన తండ్రి కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించాడు. మక్సూద్ హుస్సేన్ అనే వ్యక్తి చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఏడాది కాలంగా భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు. వారికి కలిగిన బాలిక కొన్నాళ్లుగా ముభావంగా ఉంటోంది. అనుమానం వచ్చిన తల్లి బాలికను ప్రశ్నించింది. తండ్రి హుస్సేన్ కొంతకాలంగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తు్న్నాడని తెలిపింది. దీంతో తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Top Gear: తుపాకీ పట్టిన టాక్సీ డ్రైవర్!
ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ తల్లి కూడా కూతురిపై లైంగిక దాడి చేస్తున్న, తండ్రికి సహకరించింది. 2018నవంబర్ 3వ తేదీన పలమనేరుకు చెందిన కృష్ణమూర్తి, ధనమ్మ దంపతుల కూమార్తె ఇంట్లో నిద్రిస్తోంది. మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తి తన కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అందుకు బాలిక తల్లి సహకరించింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి డీఎస్పీ రామ్ కుమార్ కేసు నమోదు చేసి కృష్ణమూర్తి దంపతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులపై నేరం రుజువుకావడంతో కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. బాధితురాలికి రూ.3లక్షల పరిహారం అందించాలని కలెక్టరును ఆదేశించింది.
Read also: Kuppam Crime: అనైతిక బంధం.. రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య..!
కూతురిపై కన్నేసిన తండ్రికి 20ఏళ్ల జైలు
కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి కాకినాడ పోక్సో కోర్టు 20ఏళ్లు జైలు శిక్షవిధించింది. దేవీపట్నం మండలం తున్నూరు గ్రామానికి చెందిన రాజేశ్వరరెడ్డి తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. విషయం తెల్సిన ఐసీడీఎస్ సూపర్ వైజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు ఫిబ్రవరి 16న కేసు నమోదు చేయగా కోర్టు నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తున్నట్లు తీర్చునిచ్చింది.