చదువు సాగిస్తున్న వారిద్దరి మధ్య ప్రేమ చిరుగురించింది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమలో పడ్డారు. ఆనందంగా గడపాలనుకున్నారు. ప్రేమ జీవితంలో అనోన్యంగా వుండాలని సంతోషంగా గడపాలనుకున్నారు. ఇద్దరు పెళ్ళికూడా చేసుకున్నారు. మూడేళ్ల తరువాత ఏమైందో ఏమో.. అతను మొఖం చాటేసాడు. ప్రేమ జీవితాంతం వుండదు కొద్దిరోజులే వుంటుంది అనే ఆరంజ్ సినిమా స్పూర్తిగా తీసుకున్నాడో ఏమో ఆప్రియురాల్ని వదిలేసి తనతో సంబంధం లేదంటూ మధ్య లోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆప్రియురాలు పోలీసులుకు ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరుకుంటోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పులివెందల చెందిన శీరిషా, జిడి నెల్లూరు నియోజక వర్గం కార్వేటినగరం మండలం ఈదివారిపల్లె చెందిన నిరంజన్ ఇద్దరు.. విజయవాడలో జిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బిటెక్ చదివే సమయంలో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగిరించింది. దీంతో వీరద్దరు 2019లో శీరిషాను పెళ్ళి చేసుకున్న నిరంజన్. మూడేళ్ళ పెళ్ళి సజావుగానే సాగుతున్న సమయంలో.. ఇప్పుడు నాకు సంబంధం లేదంటూ నిరంజన్ వదిసాడని శిరిషా వాపోయింది. నిరంజన్ మోసం చేశాడంటూ విజయవాడ, పులివెందల, కడప ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వాపోయింది.
నిరంజన్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు చేతులు దులుపుకున్నారని శిరిషా ఆరోపించింది. శిరీషా ను మూడేళ్ళు ఆగండి అని చెప్పిన నిరంజన్ తల్లిదండ్రులు.. ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్దమయ్యారని కన్నీటిపర్వంతమైంది. సీఎం జగన్ చొరవ తీసుకుని, తనకు న్యాయం చేయాలాని కోరుకుంటోంది. లేదంటే నాకు చావే శరణ్యమని శిరీషా వాపోతుంది. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు? ఆంధ్రపదేశ్ సీఎం వరకు శిరీషా సమస్య వెళ్లనుందా? వెళితే దానికి పరిష్కరిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శిరీషా చేస్తున్న తన న్యాయ పోరాటం ఏం జరగనుందో..! ఎలాంటి పరిణామాలు చవిచూడాల్సి రానుందో వేచి చూడాల్సిందే.!
Telangana Congress : టీ-కాంగ్రెస్ ఇక మారదా.? మునుగోడు గురుంచి పట్టించుకునేదెవరు..?