ప్రేమ ఎప్పుడు.. ఎలా.. ఎవరిపై పుడుతుందో చెప్పలేం.. అది పక్క ఇళ్లే కాదు.. ఊరే కావొచ్చు.. సిటీ కావొచ్చు.. మరో దేశం కావొచ్చు.. ఇప్పటికే ఎన్నో ప్రేమ కథలు ఇది నిజమని నిరూపించాయి.. తాజాగా, తిరుపతి యువతి లవ్ స్టోరీ ఖండాంతరాలు దాటింది.. అమెరికాకు చెందిన యువకుడితో ప్రేమలో పడింది.. లవ్ మాత్రమే కాదండోయ్… పెద్దలను సైతం ఒప్పించి.. శ్రీనివాసుడు పాదాల చెంత పెళ్లితో ఒక్కటయ్యారు..
Read Also: Russia-Ukraine: రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్ అమ్మాయి.. అక్కడ వార్.. ఇక్కడ ప్యార్
ఖండాంతరాలు దాటిన ప్రేమకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన జయచంద్రారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమార్తె టి.హర్షవి.. బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని బోస్టన్ మహా నగరంలోని ఓ సంస్థలో ఉద్యోగంలో చేరింది.. అయితే, అదే సంస్థలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న అమెరికాకు చెందిన డామియన్ ఫ్రాంక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది.. అంతే పెళ్లి కూడా చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. పెద్దలను ఒప్పించి.. తమ ప్రేమను పెళ్లి పీఠల వరకు తీసుకొచ్చారు.. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారంతో వివాహ వేడుకను ముందుగా అమెరికాలో నిర్వహించాలని అనుకున్నా, ఆ తర్వాత హర్షవి తల్లిదండ్రులు, బంధువుల కోరిక మేరకు తిరుపతిలోని ఓ హోటల్‌లో గురువారం రాత్రి వివాహం నిర్వహించారు.. ఈ వేడుకకు పెళ్లి కుమారుడు తండ్రి స్కాట్ బుషార్డ్, తల్లి అన్నా బుషార్డ్, పెళ్ళి కుమారుడి తమ్ముడు, అతని భార్య హాజరయ్యారు.. ఇక అందరి సమక్షంలో ఇక్కడ అమ్మాయి.. అక్కడ అబ్బాయి వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం కన్నుల పండుగగా సాగింది..