ఏపీలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పాఠశాలలకు రేపు(నవంబర్ 29) అధికారులు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రాబోయే రెండు రోజుల్లో అవి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: కడప జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు
మరోవైపు ఇప్పటికే భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ అనేక గ్రామాలు వరద ముంపులోనే మగ్గుతున్నాయి. దీని నుంచి బయటపడక ముందే.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ జారీ చేసిన తాజా హెచ్చరికలు ప్రజలకు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
చిత్తూరు జిల్లాలో రేపు అంటే 29.11.2021 అన్ని విద్యాసంస్థలకు సెలవు దినంగా జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ ప్రకటించారు.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 28, 2021