సొంత పార్టీలోని కోవర్టులకు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా షాకిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్‌ను నగరి ఎమ్మెల్యే రోజా కలిశారు. ఈ మేరకు వైసీపీలో కోవర్టులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీలో ఉంటూ టీడీపీతో అంటకాగే వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ ఫోటోలతోనూ కోవర్టులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలను ఫ్లెక్సీల్లో వేసుకుని అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Read Also: మందు బాబులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
గతంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారు వైసీపీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని రోజా పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లానని తెలిపారు. వైసీపీ పార్టీలోనే ఉంటూ టీడీపీకి కోవర్టులుగా పనిచేస్తూ కొందరు పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కోవర్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాగా ఇటీవల రోజాకు రెబల్‌గా ఉన్న వైసీపీ నేత కేజే కుమార్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసి నగరి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించాలని కోరిన సంగతి తెలిసిందే.