ఫిర్యాదు చేసేందుకు వస్తే.. పోలీసులు నిరాకరించారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయి తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో.. మనస్తాపం చెందిన ఆ మహిళ కొడుకు ప్రభుత్వ వాహనానికి నిప్పుపెట్టాడు. నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తించారు.
Karnataka: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. దుష్టశక్తులు ఉన్నాయని చెబుతూ ఓ మతగురువు మైనర్ బాలికపై కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక అన్నను బ్రెయిన్ వాష్ చేసి, అతను ఈ దురాగతానికి పాల్పడ్డాడు.
బెంగళూరు నగరంలో గురువారం సాయంత్రం ఉమేష్ అనే యువకుడు తన సహోద్యోగి పర్వీన్ ను పని ముగించుకున్నా తర్వాత దింపుతున్న సమయంలో ముస్లిం వర్గానికి చెందిన కొందరు యువకులు అతనిపై దారుణంగా దాడి చేసారు. నగరంలోని ఈరజ్జనహట్టికి చెందిన ఉమేష్, కోహినూర్ వస్త్ర దుకాణంలో ఉద్యోగి. ముస్లిం మహిళకు రైడ్ ఇచ్చాడనే కారణంతో చిత్రదుర్గలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also read: Bengaluru: బెంగళూరులో పోలీసులపై దాడి.. ఎనిమిది మంది నైజీరియన్లు అరెస్ట్.. గురువారం నాడు రాత్రి…
IPL Betting: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమైంది. మరోవైపు బెట్టింగ్ కూడా జోరుగా నడుస్తోంది. గతంలో బెట్టింగులకు పాల్పడి కోట్లలో డబ్బును కోల్పోయి, చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చూశాము. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన దర్శన్ బాబు అనే ఇంజనీర్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు.
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కి ఆదివారం ఓ చేదువార్త ఎదురైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గల ఓ గ్రామంలో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన తపస్ డ్రోన్ పరీక్షిస్తుండగా కూలిపోయింది.