Karnataka: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. దుష్టశక్తులు ఉన్నాయని చెబుతూ ఓ మతగురువు మైనర్ బాలికపై కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక అన్నను బ్రెయిన్ వాష్ చేసి, అతను ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బాలికకు వైద్యం చేయించే పేరుతో లైంగిక వేధింపులకు గురిచేశాడు. లైంగికంగా ఆమెతో వ్యవహరించాలని, అప్పుడు నయమవుతుందని చెప్పాడు.
ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక మూడేళ్లుగా ఖురాన్ చదవడానికి మసీదుకు వెళ్లేది. ఆమెకు దుష్టశక్తులు ఉన్నాయని, ఆమె ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిందితుడైన మతగురువు ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు.
Read Also: Peddapalli: పెద్దపెల్లిలో ఓట్ల లెక్కింపుకు పూర్తైన ఏర్పాట్లు..
గత ఆరేడు నెలలుగా వారానికి ఒక రోజు నిందితుడు బాలిక ఇంటికి వెళ్లేవాడు. పూజల పేరుతో బాధితురాలు, ఆమె సోదరుడిని ఒక గదిలోకి తీసుకెళ్లి, తల్లిదండ్రుల్ని బయట ఉండాలని కోరేవాడు. మైనర్ బాలికకు దుష్టశక్తులు ఉన్నాయని, ఆమెతో లైంగికంగా వ్యవహరించాలని ఆమె సోదరుడికి బ్రెయిన్ వాష్ చేశాడు. బాలికపై వైద్యం పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ ఘటనను రికార్డు చేయడంతో పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ దారుణం ఆరు నెలలుగా కొనసాగుతోంది. అయితే, బాలిక కడుపు నొప్పి కారణంగా వైద్యుడి వద్దకు వెల్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు తదుపరి విచారణ జరుగుతోంది. బాధితురాలి సోదరుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.