Karnataka: తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు.. తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు
- తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు
- తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు
- కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘటన
- నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిర్యాదు చేసేందుకు వస్తే.. పోలీసులు నిరాకరించారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయి తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో.. మనస్తాపం చెందిన ఆ మహిళ కొడుకు ప్రభుత్వ వాహనానికి నిప్పుపెట్టాడు. నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తించారు. చల్లకెరె తహసీల్దార్ కార్యాలయంలో లోపల వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అది గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు.
Gurugram: గురుగ్రామ్‌ను ముంచెత్తిన వరద.. నీట మునిగిన ఖరీదైన భవనాలు
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
అనంతరం.. నిందితుడు పృథ్వీరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాన్ని ధ్వంసం చేయడం.. అధికారిక విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)కి వినతిపత్రం సమర్పించారు.
Jaggery Ganapati: గాజువాకలో 70 అడుగుల గణపతి.. 18 టన్నుల బెల్లంతో..
అయితే.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పృథ్వీరాజ్.. జులైలో విహారయాత్రకు వెళ్లి కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో.. తన కొడుకు తన వద్దకు చేరుకోకపోవడంతో తల్లి చల్లకెరె పోలీస్ స్టేషన్‌లో జూలై 2న ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అయితే.. పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకునేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో.. నిందితుడు పృథ్వీరాజ్, జులై 23న పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో.. అతడిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో.. తహసీల్దార్ సమక్షంలో మరోసారి ఇలా చేయబోమని నిందితుడు చెప్పాడు. అనంతరం.. ఆవేశంతో తన తల్లి ఫిర్యాదును పట్టించుకోని చల్లకెరె పోలీసులపై డిఆర్‌డిఓ, విధానసౌధ సహా ప్రభుత్వ భవనాలను పేల్చివేస్తానని నిందితుడు సోషల్ మీడియాలో బెదిరించాడు. ఈ క్రమంలో.. నిందితుడి తల్లి ఫిర్యాదును నమోదు చేయని చల్లకెరె స్టేషన్‌లోని ఏఎస్‌ఐని అధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా.. తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని వాహనానికి నిప్పు పెట్టాడు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!