బెంగళూరు నగరంలో గురువారం సాయంత్రం ఉమేష్ అనే యువకుడు తన సహోద్యోగి పర్వీన్ ను పని ముగించుకున్నా తర్వాత దింపుతున్న సమయంలో ముస్లిం వర్గానికి చెందిన కొందరు యువకులు అతనిపై దారుణంగా దాడి చేసారు. నగరంలోని ఈరజ్జనహట్టికి చెందిన ఉమేష్, కోహినూర్ వస్త్ర దుకాణంలో ఉద్యోగి. ముస్లిం మహిళకు రైడ్ ఇచ్చాడనే కారణంతో చిత్రదుర్గలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also read: Bengaluru: బెంగళూరులో పోలీసులపై దాడి.. ఎనిమిది మంది నైజీరియన్లు అరెస్ట్..
గురువారం నాడు రాత్రి ప్రాంతంలో పర్వీన్‌ను దింపేందుకు ఉమేష్ చెలుగుడ్డ వైపు వెళ్తుండగా., దాదాపు ఐదుగురు యువకులు అతనిపై విచక్షణ రహితంగా ప్రవర్తించి, అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో ఉమేష్ తలతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి జరిగిన తర్వాత ఉమేష్ ధైర్యంగా చిత్రదుర్గ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆ తర్వాత పోలీసు సూపరింటెండెంట్ ధర్మేందర్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ దినకర్ చికిత్స పొందుతున్న ప్రభుత్వాసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఇంతలో, హిందూ సంఘాల సభ్యులు ఆసుపత్రి వెలుపల గుమిగూడి నిందితులకు వ్యతిరేకంగా నిరసన చేస్తూ.. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Also read: IPL tickets Hyderabad: ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ అడ్డంగా బుక్కైన ఐటీ ఉద్యోగులు..
ఇక ఇందుకు సంబంధించి విచారణలో., పర్వీన్ మాట్లాడుతూ.. రైడ్ సమయంలో తనను వేధించాడని ఆరోపిస్తూ ఉమేష్ పై ఫిర్యాదు చేసింది. ఉమేష్ అనుచితంగా ప్రవర్తించాడని., అలాగే చెప్పిన చోటికి కాకుండా వేరే ప్రదేశానికి తనను తీసుకెళ్లడానికి ప్రయత్నించాడని ఆమె పేర్కొంది. అదృష్టవశాత్తూ., తనని సోదరుడి స్నేహితులు జోక్యం చేసుకుని సురక్షితంగా ఇంటికి చేర్చారని వెల్లడించింది. దింతో
ఈ సమస్యాత్మక పరిస్థితి వెనుక ఉన్న వాస్తవాన్ని వెలికితీసేందుకు సమగ్ర దర్యాప్తు చేశునట్లు అధికారులు తెలిపారు.