వేలాది మంది ఔత్సాహిక గాయనీ గాయకులు, ప్రధాన నగరాల్లో జరిగిన వడపోత, ముగ్గురు న్యాయ నిర్ణేతలు, పదిహేను వారాల పాటు జరిగిన ప్రదర్శన… చివరగా విజేతకు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ! ఇదీ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం జరిగిన విధానం. ఫిబ్రవరి మూడోవారంలో ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ జూన్ 17వ తేదీతో ముగిసింది. ఈ షో సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు…
‘ఆచార్య’తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా కొత్తదనం ఉన్న స్క్రిప్ట్లకోసం కూడా తాపత్రయపడుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి ‘విక్రమ్’ సినిమా చూసి కమల్ హాసన్ తో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ని ఆహ్వానించి అభినందించారు. అంతే కాదు అదే మీట్ లో ప్రభాస్‌కు లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ గురించి కూడా అడిగి తెలుసుకున్నాడట. అయితే ఆ స్క్రిప్ట్ ను ప్రభాస్ నిరాకరించిన విషయం తెలిసినదే.…
తెలుగు ఇండియన్ ఐడిల్ లో పాల్గొన్న ఫైనలిస్టులకు సూపర్ ఛాన్సెస్ అదే వేదిక మీద దక్కాయి. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్స్ లో చిన్నదైన వైష్ణవికి ఏకంగా సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతారకు ప్లే బ్యాక్ పాడే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం నయనతార, చిరంజీవి మూవీ ‘గాడ్ ఫాదర్’లో ఆయన చెల్లిగా నటిస్తోంది. వీరిద్దరి మీద వచ్చే ఓ పాటలో నయన్ కు వైష్ణవితో ప్లేబ్యాక్ పాడిస్తానంటూ తమన్ ఈ వేదిక మీద మాట ఇచ్చాడు. వైష్ణవి…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న మెగా154 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ సమయంలో దర్శకుడు సుకుమార్ ఈ మూవీ సెట్ కు వెళ్ళారు. సుకుమార్ సెట్ లో వున్న ఫోటోని అభిమానులతో పంచుకుకుంది…
అటు తమిళం ఇటు తెలుగులో హాట్ టాపిక్ లోకేశ్ కనకరాజ్. కమల్ హాసన్ తో లోకేష్ తీసిన ‘విక్రమ్’ సినిమా అఖండ విజయం సాధించింది. కమల్ కున్ను అప్పులన్నింటినీ తీర్చిన సినిమాగా ‘విక్రమ్’ నిలిచింది. సందీప్ కిషన్ తో తీసిన ‘మానగరం’, ఆ తర్వాత కార్తీతో ‘ఖైదీ’, విజయ్ తో ‘మాస్టర్’ సినిమాలు సైతం లోకేష్ ప్రతిభకు పట్టం కట్టాయి. ఇప్పుడు ‘విక్రమ్’తో అపజయం ఎరుగని దర్శకుల ఖాతాలో చేరిపోయాడు లోకేష్. దాంతో టాలీవుడ్ లో లోకేష్…
బాలీవుడ్ స్టార్ పెయిర్ రణబీర్ కపూర్, అలియాభట్ నటిస్తున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ హిందీ సినిమా ప్రధాన భారతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనూ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. మూడు భాగాలుగా అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ‘బ్రహాస్త్ర’ తొలి భాగం ‘శివ’. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు కింగ్ నాగార్జున సైతం కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ ను వైజాగ్…
తెలుగు ఇండియన్ ఐడల్ చివరి దశకు చేరింది. 15 వారాల పాటు సాగిన ఈ సంగీత ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 17న తెలుగు ఇండియన్ ఐడల్ తొలి విజేత ఎవరో తెలియనుంది. ఫైనలిస్ట్ లుగా నిలిచిన ఐదుగురిలో విజేత ఎవరన్నది మెగాస్టార్ చిరంజీవి ప్రకటించనున్నారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొని గాయనీ గాయకులను ఉత్తేజపరుస్తూ వారు పాడిన పాటలకు స్టెప్స్ వేసి మరీ పులకింపచేశారు చిరంజీవి. గాయని ప్రణతి వాళ్ళ మదర్…
మెగాస్టార్ చిరంజీవి స్వగృహం నందు ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు సన్మానం జరిగింది. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను…
మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్‌కు చెల్లిగా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాతో పాటు.. ‘గాడ్ ఫాదర్’ .. ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రాలు కూడా చాలా తక్కువ గ్యాపులో చిరంజీవి పట్టాలపైకి తీసుకుని వచ్చారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాను దాదాపు పూర్తి చేసిన ఆయన, ఆ తరువాత ప్రాజెక్టులపై పూర్తి దృష్టి సారించారు. ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా రామబ్రహ్మం సుంకర ఈ…
కాలం మారుతున్నా కట్నకానుకల ఊసు కరగిపోవడం లేదు. ఒకప్పుడు ‘కన్యాశుల్కం’, ఆ పైన ‘వరకట్నం’ అన్న దురాచారాలు జనాన్ని కుదిపేశాయి. వీటిని నిరసిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక చిత్రాలు వెలుగు చూశాయి. గురజాడ సుప్రసిద్ధ నాటకం ఆధారంగా తెరకెక్కిన పి.పులయ్య ‘కన్యాశుల్కం’, యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘వరకట్నం’ ఆ కోవకు చెందిన చిత్రాలే! కె.విశ్వనాథ్ కూడా 40 ఏళ్ళ క్రితం ఆ దిశగా పయనిస్తూ రూపొందించిన చిత్రం ‘శుభలేఖ’. అప్పట్లో వర్ధమాన…