‘పక్కా కమర్షియల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రావు రమేశ్ మాట్లాడిన మాటలకు రాశీ ఖన్నా వంత పాడింది. ఆయన చెప్పింది నూటికి నూరు శాతం నిజమేనని ఫుల్ మార్కులు ఇచ్చేసింది. తొలుత వేదిక మీదకి వచ్చిన రావు రమేశ్.. ‘పక్కా కమర్షియల్ ఎవరు’ అని సుమ ప్రశ్నించగానే, దర్శకుడు మారుతి పేరు తీసుకున్నారు. ఎందుకంటే.. ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో, అదే ఈ సినిమాలో ఆ డైరెక్టర్ పెట్టారన్నాడు. పేపర్ మీద ఉన్న సీన్ల కంటే సెట్స్ లో చాలా మార్పులు చేశారని.. ప్రేక్షకులు ఏ దృష్టితో చూస్తారో.. అదే మైండ్ లో పెట్టుకొని ఛేంజెస్ చేశారని అన్నారు. నిజంగా ఆయనే పక్కా కమర్షియల్ దర్శకుడని కితాబిచ్చారు.
అది నిజమేనని తన ప్రసంగంలో భాగంగా రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డానని, ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని, రావు రమేశ్ చెప్పినట్టు సెట్స్ లో ప్రేక్షకులకు ఫలానా పాయింట్ కనెక్ట్ అవుతుందా? లేదా? అనే బేరీజులు వేసుకొని మార్పులు చేశారని తెలిపింది. తాను పని చేసిన ఉత్తమ దర్శకుల్లో మారుతి ఒకరని, మంచి క్యారెక్టరైజేషన్లు రాశారని పేర్కొంది. ఇక హీరో గోపీచంద్ తనకు షూటింగ్ సమయంలో వెన్నుదన్నుగా ఉన్నాడని, ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారని, ఇందులో ఆయన్ను ఒక కొత్త అవతారంలో ఆడియన్స్ చూడబోతున్నారని చెప్పింది. అలాగే తానూ ఒక భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నానని, ఈ పాత్ర నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందని తాను నమ్ముతున్నానని రాశీ వెల్లడించింది.
అంతకుముందు ఈ సినిమా కోసం తాను లా కూడా చేశానని తెలిపిన రాశీ ఖన్నా.. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథి విచ్చేసినందుకు మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపింది. ‘పక్కా కమర్షియల్’ థియేటర్ లో చూడాల్సిన సినిమా అని, ఇది కచ్ఛితంగా ప్రతిఒక్కరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. తనకు ఈ సినిమాలో నటించే చాన్స్ ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంది.