ఇటీవలే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ అడల్ట్ కామెడీ మూవీ తర్వాత వరుసగా సంతోష్ కు ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో ఓటీటీ మూవీకి సంతోష్ కమిట్ అయ్యాడు. అలానే ‘ప్రేమకుమార్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్ని వెబ్ సీరిస్ లలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత… సంతోష్ శోభన్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులు ధరించారు. రామ్ చరణ్ హ్యాండ్సమ్ లుక్ లో ఉండగా… చిరంజీవి మ్యాన్లీ లుక్ లో కన్పిస్తున్నారు. అయితే ఈ పిక్ కు ఓ స్పెషలిటీ ఉంది. అదేంటంటే… ఈరోజు ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తన తండ్రి చిరంజీవికి పితృ దినోత్సవం…
దర్శకుడు కొరటాల శివ ‘మిర్చి’ లాంటి తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆతర్వాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ లాంటి వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. అయితే రేపు కొరటాల శివ పుట్టినరోజు నేపథ్యంలో కొరటాల సినిమాలకు సంబంధించిన సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందా అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆచార్య సినిమా…
మెగాస్టార్ చిరంజీవి పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని… సూపర్ స్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి నిస్వార్థ సేవ హృదయాన్ని తాకిందని, కరోనా మహమ్మారి కల్పించిన క్లిష్ట పరిస్థితులలో చిరంజీవి… అలాగే ఆయన బృందం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని తెలుపుతూ చిరంజీవి చేసిన సేవను సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కొనియాడుతూ ట్వీట్…
ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి మరో ముందడుగు వేశారు. అంబులెన్స్ కొరత ఉందన్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లడంతో త్వరలోనే అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా చిరు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సాటి మనిషి ప్రాణాన్ని కాపాడడం మానవత్వానికి సంబంధించిన మహోన్నతమైన సేవ అని…
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంక్ సేవలను నెలకొల్పాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ లతో ప్రజలకు అండగా నిలుస్తున్న చిరు.. తాజాగా చిరు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాలని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో…
సీనియర్ బ్యూటీ కాజల్, కళ్యాణం తరువాత కూడా, జోరు తగ్గించటం లేదు. తెలుగు నుంచీ హిందీ దాకా పెద్ద హీరోల ఫేవరెట్ ఛాయిస్ అయిపోతోంది 35 ఏళ్ల మిసెస్ కిచ్లూ! తెలుగులో మెగాస్టార్ పక్కన ‘ఆచార్య’ మూవీ చేస్తోన్న అందాల భామ తమిళంలోనూ మరో సూపర్ సీనియర్ హీరో కమల్ తో ‘ఇండియన్ 2’లో కలసి నటిస్తోంది. ఇప్పుడిక బాలీవుడ్ నుంచీ కూడా ఓ టాప్ హీరో ఆహ్వానం పంపాడట!గతంలో అజయ్ దేవగణ్ తో కాజల్ ‘సింగం’…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు సంబంధించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నటీనటుల ద్వారా ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం ప్రభుత్వాలే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం పాటలు, షార్ట్ ఫిలిమ్స్ రూపంలో ప్రజలలో అవేర్ నెస్ కలిగిస్తున్నాయి. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) దేశంలోని టాప్ స్టార్స్ తో ఓ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. హిందీ, మరాఠీ, పంజాబీ భాషల్లో…
పౌరాణిక చిత్రాల దర్శకుడు గుణశేఖర్ స్టార్ హీరోలతో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా “చూడాలని ఉంది” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు గుణశేఖర్కు స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను కూడా ఇచ్చింది. ఆ తరువాత గుణశేఖర్-చిరు కాంబినేషన్లో సినిమా రాలేదు. డైరెక్టర్ గుణశేఖర్ వరుసగా పౌరాణిక చిత్రాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన భారీ పీరియాడిక్ మూవీ “శాకుంతలం” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.…