రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘ఖైదీ నెం150’ తో తర్వాత గ్యాప్ తీసుకున్న చిరు ప్రస్తుతం వరుసగా సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తున్నారు. చిరు నటించిన ‘ఆచార్య’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్‌డైరెక్షన్ లో ‘వేదాళం’ రీమేక్ గా ‘భోలా శంకర్’ సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయటానికి కమిట్ అయ్యాడు. ఇదలా ఉంటే మెగాస్టార్ మరో రీమేక్ పై కన్నేశారట.
ప్రస్తుతం చిరంజీవి ‘అజిత్’ నటించిన ‘వేదాళం’ సినిమాను రీమేక్ చేస్తున్నారు.
Read Also : వివాదాస్పదమైన కమెడియన్ ‘బూతు’ ట్వీట్
అలాగే 2015లొ వచ్చిన మరో అజిత్ సినిమా ‘ఎన్నై అరిందాల్’ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు రీమేక్ కోసం దర్శకుడిని వెతుకుతున్నారట. విలన్ బారి నుంచి ఓ పాపను కాపాడే మాజీ పోలీస్ అధికారి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా ‘ఎంతవాడు గానీ’ పేరుతో డబ్ అయింది. రామ్ చరణ్ కూడా తన తండ్రి చిరంజీవిని అద్భుతంగా చూపించే దర్శకుడి కోసం చూస్తున్నాడట. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాని చరణ్ నిర్మించనున్నారు.