మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న “ఆచార్య” చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు ఆయన “లూసిఫర్” రీమేక్ తో సెట్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో చిరు చికిత్స కోసం వైజాగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చికిత్స అనగానే ఏమైందో అని కంగారు పడకండి. ఆయన షూటింగ్ కు వెళ్లేముందు డిటాక్సిడ్ అండ్ రిజునీవేనేటెడ్ అవ్వాలని అనుకుంటున్నారట. దానికోసం చిరు ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నారట. అందుకోసమే చిరు వైజాగ్‌లోని ప్రముఖ ఆయుర్వేదిక్ స్పాలో ఉన్నాడని తెలుస్తోంది.…
2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం “వేదాళం” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు టాలీవుడ్ లో “వేదాళం” రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో నటించడానికి జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్న…
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్.…
మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న తమిళ ‘వేదాలం’ రీమేక్ లో ఆయన చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఈ పాత్రను లక్ష్మీ మీనన్ చేసి మెప్పించింది. అయితే తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికీ మొదటి నుండి దర్శక నిర్మాతలు కీర్తి సురేశ్ తోనే ఈ సిస్టర్ క్యారెక్టర్ చేయించాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. మొదట కీర్తి…
‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘తిమ్మరుసు’ వంటి విభిన్నమైన చిత్రాలతో యంగ్ హీరో సత్యదేవ్ నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల అద్భుతమైన నటుడు సత్యదేవ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయనను బిగ్ ఆఫర్లు కూడా పలకరిస్తున్నాయి. తాజాగా ఆయనకు ఓ మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి “లూసిఫర్” రీమేక్ లో సత్యదేవ్ కూడా నటించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న…
“సైరా నరసింహా రెడ్డి” అనే తెలుగు పీరియాడిక్ డ్రామాలో చివరిసారిగా తెరపై కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే పూర్తి కానుంది. చిరంజీవి చేతిలో ఇప్పుడు వరుస ప్రాజెక్టులు ఉన్నాయ. “ఆచార్య” పూర్తయ్యాక మరో రెండు రీమేక్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరు. మలయాళ బ్లాక్ బస్టర్ “లూసిఫర్” తెలుగు రీమేక్ లో ఆయన నటించనున్నాడు. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. ఆ తరువాత…
రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా చేశాడు సంపత్ నంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్, తమన్నా స్టారర్ ‘సిటీమార్’ మీద దృష్టి పెట్టాడు. అయితే, సంపత్ ఫిల్మ్ ఛాంబర్లో ‘గాడ్ ఫాదర్’ అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. కాకపోతే, మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్ చేస్తోన్న నిర్మాతలకి అదే పెద్ద సమస్యగా మారిందదట. ఎందుకంటే, తమ మెగా రీమేక్ కి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిలే దర్శకనిర్మాతలు అనుకుంటున్నట్టు సమాచారం. కానీ, సంపత్…
సినిమా వాళ్ళకు పండగ సీజన్ అంటే భలే ప్రేమ. ముఖ్యంగా సంక్రాంతి, దసరా ఫెస్టివల్ సీజన్ ను సొమ్ము చేసుకోవడానికి తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదలైనా ఇబ్బంది లేదనేది వారు చెప్పే మాట. భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమా…. ఈ నాలుగైదు రోజులు జనాలకు సినిమా చూసే మూడ్ బాగా ఉంటుందని సినిమా వాళ్ళ నమ్మకం. అలానే దసరా నవరాత్రుల సమయంలోనూ సినిమాలను రిలీజ్ చేస్తే… విజయం…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా “ఆచార్య”. హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సోషల్ మెసేజ్ మూవీ. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ…
కరోనా క్రైసిస్ లో సినీపరిశ్రమ కార్మికులు సహా ఆపదలో ఉన్న ఎందరినో చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరు అందించిన ఆపత్కాల సాయం చిత్రసీమలో చర్చనీయాంశం అయ్యింది. దాసరి నారాయణరావు కో-డైరెక్టర్ ప్రభాకర్ కి చిరంజీవి బృందం ఆర్థిక సాయం చేశారు. వారి అమ్మాయి చదువుకు అవసరమైన ఫీజును వారు అందించారు. ఈ విషయాన్ని గురించి స్వయంగా ప్రభాకర్ తెలియచేశారు. ”నేను దాసరి గారి వద్ద ఎన్నో సంవత్సరాలు కో-డైరెక్టర్ గా పని చేశాను. చిరంజీవి నటించిన…