మెగాస్టార్ చిరంజీవి తన ఓల్డ్ ఫ్రెండ్ తో సరదాగా కాసేపు గడిపారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తో కలిసి మెగాస్టార్ క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ “చాలా కాలం తర్వాత నా పాత స్నేహితుడు కపిల్ దేవ్ ను కలవడం అద్భుతంగా ఉంది. ఫలక్ నుమా ప్యాలెస్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాము. మన ఫస్ట్ వరల్డ్ కప్‌ను గెలిపించిన హర్యానా హరికేన్” అంటూ రాసుకొచ్చారు. ఈ ఫోటోలలో చిరంజీవి చాలా సంతోషంగా కన్పించారు.
Read Also :జన్మాష్టమి స్పెషల్ గా “రాధేశ్యామ్” రొమాంటిక్ పిక్
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడాయన మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న “భోళా శంకర్”లో నటించబోతున్నారు. మరోవైపు మాజీ స్టార్ క్రికెటర్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో “83” అనే సినిమా రూపొందుతోంది. బిటౌన్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ గా కనిపించబోతున్నాడు. ఆయన భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. విష్ణు ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న “83”ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున రిలీజ్ చేయనున్నారు. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ను ఎలా సాధించింది అనే కథను తెరపై చూపించబోతున్నారు.