ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినిమా పెద్దలు భేటీ కానున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీఎంఓ నుంచి సినీ సమస్యలపై చర్చించడానికి సినీ పెద్దలకు ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిధి బృందం సెప్టెంబర్ మొదటి వారంలో సీఎంతో సమావేశం కానున్నారని వార్తలు వచ్చాయి. అయితే నిన్నటి నుంచి ఈ సమావేశం వాయిదా పడిందని, సీఎం జగన్ ఫ్యామిలీతో కలిసి హాలిడేలో ఉండడమే దీనికి కారణమని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం అవన్నీ రూమర్స్ అని స్పష్టం అవుతోంది. టాలీవుడ్ ప్రతినిధులు సెప్టెంబర్ 4వ తేదీన జగన్‌తో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
Read Also : “నో వర్డ్స్” మామ… నాగ్ కు సామ్ విషెస్
సినిమా హాళ్లలో టికెట్ ధరలు, థియేటర్ మేనేజ్‌మెంట్‌లకు సబ్సిడీలు, పంపిణీదారులకు పన్ను మినహాయింపు వంటి అనేక ముఖ్యమైన అంశాలు సమావేశంలో చర్చించనున్నారు. లవ్ స్టోరీ, ఆచార్య, అఖండ వంటి చిత్రాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పరిమితి కారణంగా విడుదల తేదీని ఆపేస్తూ వచ్చారు. సీఎం జగన్ టిక్కెట్ ధరలను పెంచడానికి అనుమతించి, నైట్ కర్ఫ్యూ నిబంధనను సడలించినట్లయితే రాబోయే రెండు నెలల్లో థియేటర్లలో భారీ సినిమాలు విడుదల అవుతాయి. సెప్టెంబర్ 4న జరగాల్సిన టాలీవుడ్ ప్రతినిధి బృందంతో జగన్ భేటీపై ఈ అంశాలన్నీ ఆధారపడి ఉన్నాయి.