ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ ఓ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ లేకపోవడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీనిని కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తండ్రి అల్లు…
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు, మల్టీ స్టారర్ సినిమాల పోకడ కనిపిస్తోంది. అరుదైన కలయికతో సినిమాలు వస్తున్నాయి. హీరోలు కూడా తమ పరిధిని, మార్కెట్ ను పెంచుకుంటారు. తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం టాలీవుడ్ సినిమాపై కన్నేశాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసేందుకు సిద్ధమైయ్యాడు. ప్రస్తుతం చిరు ‘లూసిఫర్’ సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్…
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా నిన్నంత మెగా వేవ్ నడిచింది. ఆయన చేయబోయే ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ పూర్తిచేసిన మెగాస్టార్, విడుదల కోసం చూస్తాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత చిరు మూడు సినిమాలు చేయనున్నాడు.మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్‌ఫాదర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (పరిశీలన టైటిల్).. మెహర్ రమేష్‌తో ‘బోళా శంకర్’ సినిమాలు…
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో లో ఆయన ఉంటే ప్రాణమిచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ సంఖ్య కూడా ఎక్కువే. నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే మరి కొంత మంది మాత్రం తమ అభిమానాన్ని విభిన్నంగా చాటుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో తమిళనాడుకు చెందిన అభిమానులు చేసిన వినూత్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు…
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్ గా లేనప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ తన కొత్త డిమాండ్ తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మాట్లాడటానికి అభిమానులు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్‌ను నిర్వహించారు. అందులో దర్శకులు, నటీనటులు మరియు నిర్మాతలతో సహా పలువురు సినీ…
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజే రక్షా బంధన్ కూడా కలిసిరావడంతో మెగా కుటుంబంలో సంబరాలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్, సినీ ప్రముఖుల విషెస్ తో పాటుగా చిరు సినిమాల ప్రకటనలతో ఈసారి కూడా ఆయన బర్త్ డే వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. తాజాగా మెగా బ్రదర్స్ ఒకే చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్షా బంధన్ ను పురస్కరించుకొని సిస్టర్స్ తో రాఖీ కట్టించుకున్నారు. అనంతరం చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు నాగబాబు, పవన్ కళ్యాణ్..…
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన నటించబోయే చిత్రాల సంబందించిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలను చిరు లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఆచార్య (చిరు 152) సినిమాను పూర్తి చేసిన చిరు.. విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా…
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అభిమానులందరికీ ఫుల్ మీల్స్ దక్కినట్టు అయ్యింది. ‘ఆచార్య’ నయా పోస్టర్ రిలీజ్ దగ్గర నుండి రెండు కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరో మూవీకి సంబంధించిన పోస్టర్ సైతం విడుదలైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన విశేషాలను మాత్రం చెప్పి, చెప్పకుండా దాటేశారు. మొదట తెలిపిన టైమ్ కు కేవలం పోస్టర్ ను మాత్రం విడుదల చేశారు.…
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు (ఆగస్టు 22) తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంతోషకరమైన సందర్భంలో ఆయనకు అభిమానుల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ మెగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉదయం మెహర్ రమేష్‌తో చిరంజీవి నెక్స్ట్ మూవీ టైటిల్‌ను మహేష్ బాబు ఆవిష్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు. మీ సినిమా టైటిల్‌ని ఆవిష్కరించడం గౌరవంగా ఉంది. “భోళా శంకర్”…