‘శ్రీరస్తు… శుభమస్తు…’ అన్న పదాలు మనవాళ్ళకు మహదానందం కలిగిస్తాయి. ముఖ్యంగా శుభలేఖల్లోనూ ఈ పదాలు ప్రధానస్థానం ఆక్రమిస్తుంటాయి. శుభకార్యాల్లోనూ ఈ పదాలే జనానికి ఆనందం పంచుతూ ఉంటాయి. ‘శ్రీరస్తు-శుభమస్తు’ టైటిల్ తో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం 1981 సెప్టెంబర్ 26న విడుదలయింది. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యువతను అప్పట్లో ఆకట్టుకుంది. ఇదే టైటిల్ తో ఈ మధ్య చిరంజీవి మేనల్లుడు అల్లు శిరీష్ హీరోగా ఓ చిత్రం రూపొందింది. ‘శ్రీరస్తు-శుభమస్తు’ కథలో…
“సైరా” తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ థియేటర్లు, సినిమా షూటింగ్లపై పడకుండా ఉంటే ఇప్పటి వరకు కనీసం రెండు మెగాస్టార్ చిత్రాలు విడుదల అయ్యేవి. చిరు ప్రస్తుతం కొరటాల శివతో “ఆచార్య”, మోహన్ రాజాతో “గాడ్ ఫాదర్”, మెహర్ రమేష్ “భోళా శంకర్”, ఇంకా బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో సహా దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. Read Also : నెక్స్ట్ మూవీకి రష్మిక గ్రీన్ సిగ్నల్ అయితే…
సెప్టెంబర్ 22న మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఓ ప్రత్యేకమైన రోజు. చిత్ర పరిశ్రమలో ఆయన విజయవంతంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ఓ స్పెషల్ ట్వీట్ చేస్తూ “43 ఇయర్స్ అండ్ స్టిల్ కౌంటింగ్… మై అప్పా” అంటూ లవ్ సింబల్ ను యాడ్ చేశారు. అంతేకాకుండా 43 ఏళ్ళ క్రితం నాటి ఫోటో, తాజాగా ఆయన నటిస్తున్న ఆచార్య…
చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ బుధవారం నుంచి ఊటీలో మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ట్వీట్ ద్వారా తెలియచేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్.బి.చౌదరితో కలసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో కీలకమైన సిస్టర్ పాత్రకు నటినిఎంపిక చేయాల్సి…
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’.. దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.. ఈ సినిమా ట్రైలర్ ను రేపు ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. సీరియస్ పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. సాయి ధరమ్…
గత కొంతకాలంగా సినీ పరిశ్రమలోని సమస్యలపై, టికెట్ రేట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించడానికి టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఆహ్వానం రావడం, అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో మీట్ అవ్వడం, సమస్యల గురించి చర్చించడం చూస్తూనే ఉన్నాము. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో ఎప్పుడు భేటీ అవుతారు ? అనే విషయంపై మాత్రం స్పష్టత లేకపోయింది.…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “ఆచార్య” చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ నెలకొంది. ముందుగా ఈ సినిమా దసరా బరిలో నిలుస్తుందని అన్నారు. ఆ తరువాత సంక్రాంతి అని రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పటికే సంక్రాంతికి ఇద్దరు పెద్ద సినిమాలు…
మెగాస్టార్ చిరంజీవి ఆదివారం బిజీబిజీగా గడిపారు. “లవ్ స్టోరీ” ప్రీ-రిలీజ్ ఈవెంట్తో పాటు ‘సైమా’ అవార్డుల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘లవ్ స్టోరీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా చిరంజీవి మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ “ఐదారుమంది హీరోలో, ఐదారు మంది ప్రొడ్యూసర్లు కలిస్తే సినిమా ఇండస్ట్రీ కాదు. వీళ్ళు బాగున్నారు కదా.. సినిమా ఇండస్ట్రీ అంతా పచ్చగా ఉంది…
ఆ రోజుల్లో ‘హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్’గా పేరొందిన జోసెఫ్ విస్సారియానోవిచ్ స్టాలిన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అభిమానం ఉండేది. ఆయన పేరును తమ సంతానానికి పెట్టుకొనీ పలువురు భారతీయులు మురిసిపోయారు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవారు, హేతువాదులు స్టాలిన్ ను విశేషంగా అభిమానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సైతం స్టాలిన్ ను అభిమానించి, తన తనయుడికి ఆ పేరే పెట్టుకున్నారు. కరుణానిధి వారబ్బాయి ఎమ్.కె.స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘స్టాలిన్’ టైటిల్…
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా “లవ్ స్టోరి” అనుకోవచ్చు. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వెయిటింగ్ ముగుస్తోంది. సెప్టెంబర్ 24న “లవ్ స్టోరి” థియేటర్ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ…