చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు మరియు ఇతరులతో సహా టాలీవుడ్ ప్రముఖుల బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం గత వారం ఆగస్టులో జరగాల్సి ఉన్నప్పటికీ, తెలియని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఏపీ సిఎం ఆఫీస్ ఎట్టకేలకు సినీ పెద్దలకు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఈ అత్యున్నత సమావేశం సెప్టెంబర్ 20న జరుగుతుంది. అదే విధంగా…
చిరంజీవితో సంపత్ నంది సినిమా!? ‘సీటీమార్’ వంటి కమర్షియల్ హిట్ తో ఊపుమీద ఉన్నాడు డైరెక్టర్ సంపత్ నంది. గోపీచంద్ వంటి ప్లాప్ స్టార్ కి హిట్ ఇవ్వటమే కాక టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఊపు తెచ్చాడు. ఈ హిట్ తో ఏకంగా మెగా స్టార్ ని దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడట సంపత్ నంది. మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్నది సంపత్ నంది కల. గతంలో వీరి కలయికలో సినిమా వస్తుందనే ఊహాగానాలు వినిపించాయి.…
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తేజ్కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. ఉత్తేజ్కి చెందిన వస్త్ర వ్యాపారాన్ని కూడా పద్మావతి నిర్వహించేవారు. ఉత్తేజ్…
కరోనా క్రైసిస్ ఛారిటీని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం కొంతకాలంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా తుదిదశకు చేరుకుంది.…
సందీప్ కిషన్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ‘గల్లీ రౌడీ’ ట్రైలర్ రిలీజ్ రేపటికి వాయిదా పడింది. నిజానికి ఈ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయాలనుకున్నారు. అయితే సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వల్ల రేపటికి మారింది. ‘స్టేట్ రౌడీ’ చిరంజీవి గారు ఈ ట్రైలర్ ను ఆదివారం ఉదయం 10.30కి ట్విటర్ లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కోన ఫిలిమ్ ఫ్యాక్టర్, ఎం.వి.వి. సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాకు జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా సినిమా ఈ రోజు ఉదయం పూజతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, రణ్వీర్ సింగ్, రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సునీల్, దిల్ రాజు, తమన్ తదితరులు హాజరయ్యారు. రామ్ చరణ్ పై తీసిన మొదటి షాట్ కు చిరంజీవి క్లాప్ కొట్టారు. దర్శక దిగ్గజం రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్…
మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ప్రేమగా ‘స్టేట్ రౌడీ’ అని గతంలో పిలుచుకునే వారు. ఆ పేరుతో ఆయన ఓ సినిమాలో నటించడమే అందుకు కారణం. ఇంతకూ విషయం ఏమిటంటే… అలనాటి ఆ ‘స్టేట్ రౌడీ’… ఇప్పుడు ‘గల్లీ రౌడీ’ మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించడానికి అంగీకారం తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా వైయస్ఆర్ సీపీ పార్లమెంట్ మెంబర్ ఎం.వి.వి. సత్యనారాయణ, ప్రముఖ రచయిత కోన వెంకట్ ‘గల్లీ రౌడీ’ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 17న ఈ సినిమా…
మంచు మనోజ్ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ఆశాజనకమైన ప్రణాళికలకు తాను సపోర్ట్ చేస్తున్నాను అని మనోజ్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో మంచు మనోజ్ తాను ముఖ్యమంత్రితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. “దూరదృష్టి గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న కొన్ని గొప్ప ఆలోచనల…
నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశంలో “టీచర్స్ డే”ను సెలబ్రేట్ చేసుకుంటారు. భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి, దేశానికి రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ రోజున జన్మించారు. డా. రాధాకృష్ణన్ పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ రోజు దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులను గౌరవిస్తారు. Read Also : “మా”లో విభేదాలు : బండ్ల గణేష్ అవుట్… ప్రకాష్ రాజ్ తో గొడవేంటి ? కోరికలను నెరవేర్చమని దేవుడిని…
(సెప్టెంబర్ 3న ’47 రోజులు’కు 40 ఏళ్ళు పూర్తి) చిరంజీవి, జయప్రద జంటగా నటించిన ’47 రోజులు’ చిత్రం సెప్టెంబర్ 3తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించారు. అంతకు ముందు బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’లోనూ భార్యను హింసించే భర్త పాత్రలో చిరంజీవి నటించారు. అందులో జయసుధ నాయిక. ఇందులో జయప్రద భర్తగా ఆమె 47 రోజులు కాపురం…