మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ శరవేగంగా సాగుతోంది. 2017లో ‘ఖైదీ నంబర్ 150’తో 150వ చిత్రం పూర్తి చేసిన చిరంజీవి ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా ‘సైరా’ మూవీ చేశాడు. ఇక 152వ చిత్రం ‘ఆచార్య’ నుండి ఒక్కసారిగా వేగం పెంచాడు. చిరు, చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ వచ్చే యేడాది ఫిబ్రవరిలో జనం ముందుకు రాబోతోంది. ఒకేసారి ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాలతో పాటు బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్ లో మరో సినిమాలోనూ చిరంజీవి ఇప్పుడు నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా చిరంజీవి 156వ చిత్రం తాలుకు ప్రకటన మరికాసేపట్లో రాబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తొలిసారి చిరంజీవితో మూవీ తీయబోతున్నాడు. ఈ సినిమాను ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేయబోతున్నాడు