Mega154 : యాక్షన్ లోకి దిగిన మెగాస్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega154 కోసం మెగాస్టార్ యాక్షన్ లోకి దిగారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా154’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా చిరంజీవి, ఫైటర్స్‌పై ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్‌తో బృందం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. యాక్షన్ బ్లాక్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షించగా, హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో మేకర్స్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తోన్న శృతి హాసన్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
Read Also : PVR-INOX Merger: సినీపోలీస్‌కు ట్విస్ట్.. పీవీఆర్-ఐనాక్స్ విలీనం
Also Read
ఇక తాత్కాలికంగా ‘మెగా154’ అనే టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ, శృతిహాసన్ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘మెగా154’కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!