మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టారు. అంతేకాకుండా ఆ ప్రాజెక్ట్ లను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ మరో రీమేక్ పై మనసు పడ్డారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం “బ్రో డాడీ” ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే సినిమా తెలుగు రీమేక్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ను యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతిలో పెట్టాలని భావిస్తున్నారట చిరు.
Read Also : Chiranjeevi : సాంస్కృతిక మహోత్సవాలపై స్పెషల్ వీడియో
హరీష్ శంకర్ సినిమాను బాగా హ్యాండిల్ చేయగలడని భావించిన మెగాస్టార్ స్క్రిప్ట్‌పై పని చేసి, త్వరగా కథను చెప్పమని దర్శకుడిని కోరాడని సమాచారం. ప్రస్తుతం హరీష్ శంకర్ తన బృందంతో కలిసి ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నాడట. హరీష్ శంకర్ గత రెండేళ్లుగా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. పవన్ హీరోగా “భవదీయుడు భగత్ సింగ్” చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు హరీష్. పవన్ కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టడంతో హరీష్ శంకర్ ఇప్పటికి వెయిటింగ్ మోడ్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతానికి హరీష్ “భవదీయుడు భగత్ సింగ్”ను పూర్తి చేసి, మెగాస్టార్ చిత్రాన్ని తెరకెక్కిస్తారా? లేదా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూడకుండా మెగాస్టార్‌ని డైరెక్ట్ చేస్తాడా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ పరిస్థితులు చూస్తుంటే పవర్ స్టార్ తో కాకుండా మెగాస్టార్ తో హరీష్ శంకర్ సినిమా మొదలుపెడతారేమో అన్పిస్తోంది.