నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ.. మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీకి ఘన స్వాగతం పలికేందుకు కర్ణాటక క్రికెట్ సంఘం బెంగళూరులో భారీ ఏర్పాట్లు చేసింది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీ ఎత్తున అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా…
18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో ఆర్సీబీ గెలవగానే బెంగళూరులో సంబరాలు మిన్నంటాయి. రాత్రంతా ఆ నగరం నిద్రపోలేదు. ర్యాలీలు, నినాదాలు, పటాసుల శబ్దంతో బెంగళూరు మొత్తం దద్దరిల్లింది. ఇక బుధవారం ఆర్సీబీ ఆటగాళ్లు సొంతగడ్డకు వస్తుండడంతో.. విజయోత్సవాలు ఇంకా గొప్పగా చేసుకోవాలనుకున్న అభిమానులకు…
Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడగా.. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏమిటంటే.. ఆర్సీబీ జట్టు అభిమానులు ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా సరైన సమయంలో గేట్లు ఓపెన్ చేయకపోడం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. చిన స్వామి స్టేడియానికి ఆర్సీబీ అభిమానులు పోటెత్తడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అభిమానులు పరుగులు తీయడంతో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 15 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. అయితే.. ఈ నేపథ్యంలో భారీ జనసమూహం కారణంగా ఆర్‌సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్-బస్ పరేడ్ రద్దు చేశారు.…
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడారు. జనసమూహాన్ని నిర్వహించడానికి 5000 మంది సిబ్బందిని నియమించినట్లు స్పష్టం చేశారు. కానీ మరణాల సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు. "నేను ఇంకా సంఖ్యలను నిర్ధారించలేను, నేను ఇప్పుడు స్టేడియంకు వెళ్తున్నాను. చాలా మంది భావోద్వేగ అభిమానులను చేరుకున్నారు. 5000 సిబ్బందిని మోహరించాం" అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇండియా టుడేతో అన్నారు.
RCB vs RR: నేడు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రజత్ పాటిదార్ నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో ఇప్పటివరకు మంచి ప్రదర్శన ఇచ్చింది. మొత్తం 8 మ్యాచ్ లలో ఐదు మ్యాచ్‌లను గెలిచి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. అయితే, ఆ జట్టు తన సొంత…
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి.. ఐదు విజయాలు సాధించింది. ఈ ఐదు విజయాలు బయటి మైదానాల్లో సాధించినవే కావడం గమనార్హం. హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓడిపోయింది. నేడు సొంత మైదానంలో ఆడేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో బెంగళూరు తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ హోంగ్రౌండ్ ప్రదర్శనపై స్పందించాడు. ఓటములకు సాకులు చెప్పడం సరైంది కాదన్నాడు. ‘చిన్నస్వామి స్టేడియం పిచ్‌లు కాస్త…
సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరోసారి ఓటమి పాలైంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఈ సీజన్‌లో బెంగళూరు ఏడు మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగు విజయాలు సాధించింది. విజయం సాధించిన ఈ నాలుగు మ్యాచ్‌లో బయటి స్టేడియాల్లోనే కావడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్-34లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడనుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ టాస్ 7 గంటలకు జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ లేట్ అవుతోంది. భారీ వర్షం కురవడంతో స్టేడియాన్ని కవర్లతో కప్పారు.