RCB vs RR: నేడు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రజత్ పాటిదార్ నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో ఇప్పటివరకు మంచి ప్రదర్శన ఇచ్చింది. మొత్తం 8 మ్యాచ్ లలో ఐదు మ్యాచ్‌లను గెలిచి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. అయితే, ఆ జట్టు తన సొంత మైదానంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ సీజన్ లో చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించగలిగింది. గాయం కారణంగా కెప్టెన్ సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. దీని కారణంగా రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
RCB ప్లేయింగ్ XI:
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), రొమారియో షెఫర్డ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్
ఇంపాక్ట్ ప్లేయర్స్:
సుయశ్ శర్మా, రసిఖ్ సలామ్, మనోజ్ భండగే, జేకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్
RR ప్లేయింగ్ XI:
యశస్వి జైస్వాల్, శుభం దూబే, నితీశ్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శిమ్రాన్ హెట్‌మైర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్హక్ ఫరూకీ, సందీప్ శర్మా, తుషార్ దేశ్‌పాండే
ఇంపాక్ట్ ప్లేయర్స్:
వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మాధవాల్, కునాల్ సింగ్ రాథోర్