సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరోసారి ఓటమి పాలైంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సునాయాసంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఈ సీజన్‌లో బెంగళూరు ఏడు మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగు విజయాలు సాధించింది. విజయం సాధించిన ఈ నాలుగు మ్యాచ్‌లో బయటి స్టేడియాల్లోనే కావడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
READ MORE: Delhi: బాలుడి హత్య కేసులో లేడీడాన్ జిక్రా అరెస్ట్.. ఆమె ఎవరంటే..!
సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక పోయింది ఆర్సీబీ. పది జట్లలో మిగతా జట్లన్నీ హోంగ్రౌండ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాయి. కానీ.. ఆర్సీబీ మాత్రమే హోం గ్రౌండ్‌లో విజయం సాధించకపోవడం గమనార్హం. అంతే కాకుండా.. ఒకే వేదికపై అత్యధిక ఓటములు చవిచూసిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. బెంగళూరులో 46 మ్యాచుల్లో ఆ జట్టు ఓడిపోయింది. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ తన హోం గ్రౌండ్‌లో 45 మ్యాచుల్లో పరాజయం పాలైంది.
READ MORE: GT vs DC: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ-గుజరాత్ మధ్య 5 మ్యాచ్‌లు.. అత్యధికంగా గెలిచిన టీం ఇదే!
ఆర్సీబీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని అందరికీ తెలిసిందే. ఆర్సీబీ ఎలాగైనా కప్పుకొట్టాలని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సారైనా కప్పు వస్తుందని ఆశిస్తున్న ఫ్యాన్స్‌కి ఈ వార్త చేదు అనుభవంగా మారుతుంది. ఆర్సీబీకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత గడ్డపై విజయం.. ఆర్సీబీకి ఎందుకు సాధ్యం కావడం లేదని బాధపడుతున్నారు.
READ MORE: GT vs DC: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ-గుజరాత్ మధ్య 5 మ్యాచ్‌లు.. అత్యధికంగా గెలిచిన టీం ఇదే!