‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద చిచ్చు రేపాయి. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఈ అంశంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. లూలూ మాల్‌లో వేధింపులకు గురైన నటినే తప్పుబట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి దుస్తులను సాకుగా చూపిస్తూ నేరస్తుల ప్రవర్తనను…
నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. రామ్ గోపాల్ వర్మ, మంచు లక్ష్మి వంటి వారు శివాజీని విమర్శించగా, నటి కరాటే కల్యాణి మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. శివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని ఆమె సమర్థించారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా రావడం వల్ల సమాజంలో సంస్కృతి దెబ్బతింటుందని, పిల్లలు వాటిని చూసి పాడయ్యే అవకాశం ఉందని కల్యాణి ఆందోళన వ్యక్తం…
ప్రస్తుతం సోషల్ మీడియాలో నటుడు శివాజీ మరియు సింగర్ చిన్మయి శ్రీపాద మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆడవారి దుస్తుల గురించి శివాజీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒక పక్క శివాజీ తన మాటల్లో తప్పు లేదంటుంటే.. చిన్మయి మాత్రం ఆయన వాడిన భాషపై తీవ్రంగా మండిపడుతోంది. అసలు విషయం ఏంటంటే.. Also Read : Mamitha Baiju: ఆ క్రికెటర్ చేతిలో మమితా బైజు పెళ్లి బాధ్యతలు.. లవ్ మెసేజ్‌లన్నీ ఆయనకే…
అభిమానం అనేది ఉండవచ్చు కానీ, అది అదుపు తప్పితే అవతలి వారికి నరకం చూపిస్తుంది. తాజాగా ‘రాజాసాబ్’ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో ఎదురైన అనుభవం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుధవారం సాయంత్రం జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. కేవలం ఫోటోలు, సెల్ఫీల కోసం హీరోయిన్ మీదకు ఎగబడటం, ఆమెను తాకడం, తోసేయడం వంటి పనులు చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిధి అగర్వాల్ ఎలాగోలా కారులోకి…
Chinmayi Sripada: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది. ఆవిడ పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ..‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడని., ఈ కేసులో ఆ అమ్మాయి పోరాడేందుకు కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. ఇకపోతే ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద…
గాయని చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్ చిన్మయి తన పాటలతోనే కాకుండా పలు కాంట్రవర్సీలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సహా నటీమణులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తరచుగా స్పందిస్తూ ఉంటారు. అలానే పిల్లలపై ఎక్కడైనా వేధింపులు జరిగినట్లు తన దృష్టికి వచ్చినా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై పెద్ద చర్చే నడుస్తోంది.
Chinmayi: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రంతో సంగీత అభిమానులను ఎంతగా అలరించిందో.. ఆడవాళ్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే సోషల్ మీడియాలో అమాంతం ప్రత్యక్షమయ్యి అండగా నిలుస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే.. వారిని తనదైన రీతిలో ఏకిపారేస్తుంది.