Chinmayi Sripada Gives Strong Counter To Netigen Over Sakshi Malik Brij Bhushan Viral Photo: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. స్టార్ రెజ్లర్లు కొన్ని రోజుల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే! ఈ నిరసనకు క్రీడాకారులు ఒక్కొక్కరుగా తమ మద్దతు తెలుపుతున్నారు. మన దేశానికి అవార్డులు తెచ్చిపెట్టి, గర్వకారణంగా నిలిచిన రెజ్లర్లు.. ఇలా వీధుల్లోకి ఎక్కడం బాధాకరమైన విషయమని.. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుతూ తమ సపోర్ట్ తెలుపుతున్నారు. ఇప్పుడు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా వీరికి తన మద్దతుని ప్రకటించింది. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది.
Asia Cup 2023: పాకిస్తాన్‌కి బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఆసియా కప్ రద్దు?
అసలు మేటర్ ఏమిటంటే.. నిరసన వ్యక్తం చేస్తున్న వారిలో ఒకరైన సాక్షి మాలిక్‌కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అది.. సాక్షి మాలిక్ వివాహానికి బ్రిజ్‌భూషణ్ హాజరైన ఫోటో! ఆ ఫోటోని నెట్టింట్లో వైరల్ చేస్తూ.. సాక్షి మాలిక్‌పై కొందరు నెటిజన్లు ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. ‘‘బ్రిజ్‌భూషణ్ తనని వేధించారని 2015-16 సమయంలో ఆరోపణలు చేసింది. అయితే.. 2017లో ఆమె వివాహం జరగ్గా, ఆ పెళ్లికి బ్రిజ్‌భూషణ్ అతిథిగా విచ్చేశారు. తనని వేధించిన ఓ వ్యక్తిని.. ఏ అమ్మాయి అయినా పెళ్లికి ఆహ్వానిస్తుందా?’’ అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ఇందుకు చిన్మయి శ్రీపాద స్పందిస్తూ.. ఆ నెటిజన్‌కి మొట్టికాయలు వేసింది. ‘‘అవును, ఆమె పిలుస్తుంది. ఎందుకంటే.. వేధించే వ్యక్తి చేతిలో అధికారం ఉన్నప్పుడు, ఆమెకు పిలవడం తప్ప మరో అవకాశం ఉండదు. మహిళలు తమ సొంత కుటుంబంలోనే వేధింపులకు గురవుతుంటారు. కానీ.. అందరిముందు బాగానే ఉన్నట్టు నటిస్తుంటారు. వేధింపులకు పాల్పడేవారు, వారికి మద్దతు తెలిపేవారు.. ఈ భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోతారని నేను ఆశిస్తున్నా’’ అంటూ బదులిచ్చింది.
Yashaswi Jaiswal: చరిత్ర సృష్టించిన యశస్వీ.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు
చిన్మయి చేసిన ఈ ట్వీట్‌ని సాక్షి మాలిక్ రీట్వీట్ చేస్తూ.. తన అభిప్రాయం కూడా అదే అన్నట్టుగా విమర్శకులకు సమాధానం ఇచ్చింది. కాగా.. రెజ్లర్లు విస్తృతస్థాయిలో నిరసనలు చేస్తుండటం, వారికి మద్దతు కూడా వస్తున్న తరుణంలో.. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటికీ రెజ్లర్లు తమ ఆందోళనను విరమించుకోలేదు. బ్రిజ్‌భూషణ్‌ని అరెస్ట్ చేసి, ఆయన గురించి వేసిన పర్యవేక్షక కమిటీ నివేదికను బయటపెట్టాలని దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు రాజకీయ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ మద్దతు తెలుపుతున్నారు.