Japan deploying long-range missiles to counter China: నిత్యం చైనా, నార్త్ కొరియాల నుంచి ఎదురవుతున్న బెదిరింపులకు ధీటుగా.. తమ సార్వభౌమాధికారాన్ని, తన భూభాగాలను రక్షించుకోవడానికి.. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు జపాన్ సిద్ధం అవుతుంది. ముక్యంగా జపాన్ సరిహద్దుల్లో ఉన్న చైనా, నార్త్ కొరియాలే లక్ష్యంగా క్షిపణులను మోహరిస్తోంది. దాదాపు 1000 దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోహరించే ఆలోచనలో జపాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. ఇప్పుడు తగ్గుతున్న జనాభా వృద్ధి రేటులో ఆందోళన చెందుతోంది. శ్రామిక శక్తి తగ్గి.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదముందని భయాందోళనకు గురవుతోంది. ఈ క్రమంలోనే జనాభా పెంపు కోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది.
కౌగిలింత అనేది మనిషిలోనే టెన్షన్‌ను దూరం చేస్తుంది అంటారు.. ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా చెప్పుకునే కౌగిలింతతో.. అప్పటి వరకు ఉన్న బాధలు మరిచి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయంటారు.. లింగ బేధం లేకుండా సందర్భాన్ని బట్టి, అభినందించే సమయాన్ని బట్టి కూడా కౌగిలింతలు ఇస్తుంటారు.. అయితే, ఓ మహిళ.. కౌగిలింతపై కోర్టుకు వెళ్లడం.. కోర్టు భారీగా జరిమానా విధించడం ఆసక్తికరంగా మారింది.. కొలిగ్ తనను గట్టిగా కౌగిలించుకున్నాడని కోపగించుకున్న మహిళ.. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కారు.. ఈ…
చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. లివర్, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే లాంగ్యా హెనిపావైరస్ అనే కొత్త జూనోటిక్ వైరస్‌ను చైనా గుర్తించింది. ఈ కొత్త వైరస్ ఇప్పటికే 35 మందికి సోకినట్లు సైంటిస్టులు గుర్తించారు. లాంగ్యా వైరస్ జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
China delayed sanction on top terrorist: ఇండియా అంటే నిలువెల్లా వ్యతిరేకత ప్రదర్శించే చైనా మరోసారి అలాంటి పనే చేసింది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యదేశం కోసం వీటో అధికారం ఉన్న రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఒప్పుకుంటుంటే.. చైనా మాత్రం ఎప్పటికప్పుడు భారత్ సభ్యత్వాన్ని సాకులు చూపెడుతూ అడ్డుకుంటూ వస్తోంది. యూఎన్ లో భారత్ ఏ తీర్మాణం ప్రవేశపెట్టిన వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై భారత్ పలుమార్లు…
Langya henipavirus: చైనా వూహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయి. కరోనా వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తారుమారయ్యాయి. దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇదిలా ఉంటే చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. షాన్ డాంగ్, హెనాన్ ప్రావిన్స్ లో లాంగ్యా హెనిపా వైరస్ విస్తరిస్తోంది. ఈ రెండు ప్రావిన్సుల్లో ప్రజలుకు ఈ వ్యాధి సోకినట్లు చైనా మీడియా మంగళవారం ప్రకటించింది.…
అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్ చుట్టూ చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇటీవల తైవాన్ పర్యటనను అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ విజయవంతంగా ముగించారు. తాజాగా మరోసారి డ్రాగన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్‌కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదన్నారు.
China,Taiwan Issue - 27 Chinese warplanes enter Taiwan's air defence zone: స్వయం పాలిత తైవాన్ ద్వీపాన్ని చేజిక్కించుకునే ఆలోచనలో డ్రాగన్ కంట్రీ చైనా ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వన్ చైనా విధాానాన్ని అమెరికా దిక్కరిస్తోందని చైనా తన ఆక్రోషాన్ని వెల్లగక్కుతోంది. నిప్పుతో చెలగాటమాడుతున్నారని.. అమెరికాను హెచ్చరించింది.