Langya henipavirus: చైనా వూహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయి. కరోనా వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తారుమారయ్యాయి. దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇదిలా ఉంటే చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. షాన్ డాంగ్, హెనాన్ ప్రావిన్స్ లో లాంగ్యా హెనిపా వైరస్ విస్తరిస్తోంది. ఈ రెండు ప్రావిన్సుల్లో ప్రజలుకు ఈ వ్యాధి సోకినట్లు చైనా మీడియా మంగళవారం ప్రకటించింది.…
అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్ చుట్టూ చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇటీవల తైవాన్ పర్యటనను అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ విజయవంతంగా ముగించారు. తాజాగా మరోసారి డ్రాగన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్‌కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదన్నారు.
China,Taiwan Issue - 27 Chinese warplanes enter Taiwan's air defence zone: స్వయం పాలిత తైవాన్ ద్వీపాన్ని చేజిక్కించుకునే ఆలోచనలో డ్రాగన్ కంట్రీ చైనా ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వన్ చైనా విధాానాన్ని అమెరికా దిక్కరిస్తోందని చైనా తన ఆక్రోషాన్ని వెల్లగక్కుతోంది. నిప్పుతో చెలగాటమాడుతున్నారని.. అమెరికాను హెచ్చరించింది.
Chinese rocket reenters atmosphere over Indian Ocean: ప్రపంచాన్ని కలవరపెడుతున్న చైనా రాకెట్ ఎలాంటి నియంత్రణ లేకుండా హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్లు యూఎస్ఏ ధ్రువీకరించింది. తూర్పు కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు చైనా రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు యూఎస్ స్పెస్ కమాండ్ శనివారం వెల్లడించింది.
China's response to Rishi Sunak's comments: యూకే ప్రధానమంత్రి అభ్యర్థి రిషి సునక్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. రిషి సునక్ చైనాపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమైనవిగా చైనా ఆరోపించింది. ప్రధాని మంత్రి రేసులో భాగంగా ఆయన చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ స్పందింస్తూ... ‘‘ చైనా ముప్పు’’అని ప్రచారం చేసినంత మాత్రాన ఒకరి సొంత సమస్యలను పరిష్కరించలేమని ఆయన వ్యాఖ్యానించారు.…
కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల తర్వాత కూడా, చైనా యుద్ధ విమానాలు తూర్పు లద్ధాఖ్‌లో మోహరించి భారత బలగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. గత మూడు నాలుగు వారాల్లో వాస్తవాధీన రేఖకు దగ్గరగా డ్రాగన్‌కు చెందిన విమానాలు ఎగురుతూనే ఉన్నాయి.
india and china population decreased by year of 2100: ప్రపంచంలో జనాభా పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2022 లెక్కల ప్రకారం చైనాలో జనాభా 142.6 కోట్లుగా ఉంటే భారత్ జనాభా 141.2 కోట్లుగా ఉంది. అయితే ఓ సర్వే ప్రకారం 2100 నాటికి చైనా జనాభా 49.4 కోట్లకు తగ్గిపోనుంది. అంతేకాకుండా భారత్‌లో కూడా జనాభా 100.3 కోట్లకు చేరనుంది. అంటే భారత్‌లో జనాభా 41 కోట్లు…
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సింగపూర్ ఓపెన్-2022 విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్‌లో చైనా ప్లేయర్ వాంగ్ జి యీని 21-9, 11-21, 21-15 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ప్రారంభసెట్ను సింధు 12 నిమిషాల్లోనే ముగించింది. దీంతో 21-9తో తొలి సెట్‌ను సింధు గెలవగా రెండో సెట్‌ను 21-11 తేడాతో వాంగ్ జి యీ గెలిచింది. దీంతో మూడో సెట్లో…