India "Tracking" China Spy Ship Ahead Of Missile Launch: భారతదేశంపై చైనా తీరు మార్చుకోవడం లేదు. భారత్ పై నిఘాను పెంచేందుకు చైనా గూఢాచర నౌకలు తరుచుగా హిందూ మహాసముద్రానికి వస్తున్నాయి. మూడు నెలల క్రితం ఇలాగే చైనాకు చెందిన గూఢాచారి నౌక యువాన్ వాంగ్ 5ని శ్రీలంకకు పంపింది చైనా. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పినా.. శ్రీలంక పట్టించుకోలేదు. హంబన్ టోటా ఓడరేవులో ఈ నౌకకు డాకింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఇదిలా…
India had clearly told Colombo not to allow docking of Chinese military vessels: చైనా బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ నౌక వాంగ్ యువాన్ 5ను హంబన్ టోట వద్ద డాకింగ్ చేయడానికి కొన్ని నెలల క్రితం శ్రీలంక అనుమతి ఇచ్చింది. భారత్ ఎన్ని అభ్యంతరాలను తెలిపినా.. శ్రీలంక ఆ నౌకకు అనుమతి ఇచ్చింది. శ్రీలంక నుంచే భారత్ అణు కార్యక్రమాలు, క్షిపణి కార్యక్రమాలు, స్పేస్ ఏజెన్సీపై నిఘా పెట్టే అవకాశం ఉంటుందని భారత్…
China Locks Down Area Around iPhone Factory: చైనాలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ ను కఠినంగా అమలు చేస్తోంది. చైనా ప్రజల నుంచి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అధ్యక్షుడు జి జిన్ పింగ్ పై విమర్శలు, నిరసన వ్యక్తం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. తాజాగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాన్ని బుధవారం దిగ్బంధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా లాక్ చేశారు. కోవిడ్ నివారణ…
Chinese people protest with Bappi Lahiri song: చైనా దేశంలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ తో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా జి జిన్ పింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ హిందీ పాట తెగ క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పుడో 1982లో బప్పిలహరి స్వరపరిచిన ‘‘జిమ్మి..జమ్మి’’ సాంగ్ తెగ హల్చల్ చేస్తోంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలిపే ఓ పాటగా దీన్ని ఎంచుకున్నారు. 82లో మిథున్…
సూది అవసరం లేకుండానే నోటి ద్వారా తీసుకునే కొవిడ్-19 టీకా పంపిణీని చైనా షురూ చేసింది. చైనాలోని షాంఘై నగరంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ తరహా వ్యాక్సిన్ ప్రపంచంలో మొదటిదని చెబుతున్నారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ 20 మహాసభలు నేటితో ముగియనుండగా.. ఆ సమావేశాల్లో డ్రామా చోటుచేసుకుంది. అయిదేళ్లకు ఒకసారి జరిగే సీపీసీ సమావేశాలు గత ఆదివారం ప్రారంభం అయ్యాయి. కాగా నేడు చివరిరోజు కాగా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోను సమావేశాల నుంచి బయటకు తీసుకెళ్లారు.
China Enshrines Opposition To Taiwan Independence Into Its Constitution: చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. దీంతో పలు కీలక తీర్మాణాలు చేస్తోంది ఆ పార్టీ. దీంట్లో భాగంగానే తైవాన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శనివారం తన రాజ్యాంగంలో తైవాన్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా నిబంధనలను తీసుకువచ్చింది. తైవాన్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ముగింపు సమావేశాల్లో తీర్మాణం చేసింది.
China's Communist Party Meeting To End Today With Xi Jinping Set For 3rd Term: చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. గత ఆదివారం రోజున రాజధాని బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. పార్టీలో కీలక పదవులకు ఎన్నికలు జరగడంతో పాటు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.…
Centre Clears Construction Of 6 Corridors In Arunachal Near China Border: భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. భారత్ ను ఇరుకునపెట్టేందుకు ఇప్పటికే చైనా కొత్త గ్రామాలను, రోడ్డు, ఎయిర్ స్ట్రిప్స్, ఎయిర్ బేసులను నిర్మించింది. గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా తన సైనిక నిర్మాణాలను పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే భారత్ కూడా చైనాకు ధీటుగా సరిహద్దుల్లో మౌళిక నిర్మాణాలను చేపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకుని చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో…