World is about to reach 8 billion population. UN report gives key highlights: ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోబోతోంది. నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచాన వేసింది. ఇది 1950తో పోలిస్తే 3 రెట్లు అధికం అని యూఎన్ఓ వెల్లడించింది. 1950లో ప్రపంచ జనాభా 250 కోట్లగా ఉంటే ప్రస్తుతం 800 కోట్ల చేరువకు దగ్గరలో ఉంది. 1960 ప్రారంభంలో జనాబా పెరుగుదల రేటు గరిష్టం స్థాయికి చేరుకుందని.. ప్రస్తుతం క్షీణిస్తుందని యూఎన్ తెలిపింది.
వార్షిక జనాభా వృద్ధి రేటు 1962-1965 మధ్య గరిష్టంగా 2.1 శాతం ఉంటే 2021 నాటికి 1 శాతానికి పడిపోయిందని తెలిపింది. సంతానోత్పత్తి క్షీణత కారణంగా ఇది 2050 నాటికి 0.5 శాతానికి తగ్గిపోవచ్చని యూఎన్ఓ నివేదికలో వెల్లడించింది. ఈ దశాబ్ధ చివరి నాటికి (2030) ప్రపంచ జనాభా 850 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. 2050 నాటికి 970 కోట్లకు, 2080 నాటికి 1004 కోట్లకు చేరుకుంటుందని అంచానా వేసింది. ఇదిలా ఉంటే యూఎస్ఏకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్-2020 అధ్యయనంలో మాత్రం ప్రపంచ జనాభా 2064 నాటికే గరిష్టంగా 1000 కోట్లకు చేరుతుందని.. 2100 నాటికి ఇది 880 కోట్లకు తగ్గుతుందని అంచానా వేసింది.
Read Also: Supreme Court: అత్యాచార కేసులో నిందితులు విడుదల..”బెనిఫిట్ ఆఫ్ డౌట్” కారణం
తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు:
ఇదిలా ఉంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నట్లు యూఎన్ నివేదిక వెల్లడించింది. 2021లో సగటున సంతానోత్పత్తి రేటు 2.3 శాతంగా ఉంటుందని.. ఇది 1950లో ఉన్న 5 శాతంతో పోలిస్తే చాలా తక్కువ. ఇది 2050 నాటికి 2.1 శాతానికి పడిపోతుందని అంచానా వేసింది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రజల ఆయుర్ధాయం కూడా జనాభా పెరుగుదలకు కారణం అని నివేదిక తెలిపింది. 2019లో సగటున ప్రజల ఆయుర్ధాయం 72.8 ఏళ్లుగా అంటే 1990తో పోలిస్తే తొమ్మిదేళ్లు ఎక్కువ. 2050 నాటికి ఇది 77.2 ఏళ్లకు చేరుతుందని అంచనా. సంతానోత్పత్తి క్షీణత వల్ల 65 ఏళ్లకు పైబడిన వారి నిష్ఫత్రి 2050 నాటికి 16 శాతానికి పెరుగుతుందని అంచనా.
Read Also: Stone Pelting: అసదుద్దీన్ ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్‌పై రాళ్లదాడి.. అలాంటిదేం లేదన్న పోలీసులు
2023లో చైనాను క్రాస్ చేయనున్న ఇండియా:
2023 నాటికి జనాభాలో చైనాను భారత్ అధిగమించనుందని యూఎన్ నివేదిక తెలిపింది. 2023 నుంచి చైనా జనాభా క్షీణత ప్రారంభం అవుతుందని.. 2050 నాటికి 130 కోట్లకు పడిపోతుందని పేర్కొంది. ఈ శతాబ్ధం చివరకు చైనా జనాభా 80 కోట్లకు పడిపోతుందని అంచనా. ఇదిలా ఉంటే భారత జనాభా 2050 నాటికి 170 కోట్లకు చేరుకుంటుందని నివేదిక వెల్లడించింది. 2050 నాటికి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్, చైనా, అమెరికా తొలిమూడు స్థానాల్లో ఉండనున్నాయి. నాలుగో స్థానంలో నైజీరియా ఉండనుంది.
ఎనిమిది దేశాల్లోనే సగం జనాభా:
ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే ఎనిమిది దేశాల్లోనే సగం ప్రపంచ జనాభా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2050 నాటికి భారత్, చైనా, అమెరికా, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లోనే సగం జనాభా ఉండనుంది.