America vs China : చైనాకు పోటీగా అమెరికా ఇప్పుడు సరికొత్త ప్రణాళికతో కసరత్తు చేస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ మీదుగా చైనాను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. తన భారత పర్యటనను వాయిదా వేసుకుని చైనాలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఇండియాలో పర్యటించాల్సింది ఉంది.. కానీ ఆదివారం అకస్మాత్తుగా చైనాను సందర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాల పరంగా చైనా రెండవ అతిపెద్ద మార్కెట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.. వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మస్క్ పర్యటనకు సంబంధించిన విషయాలు తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు.
Srilanka : శ్రీలంక ప్రభుత్వం తన 209 మిలియన్ డాలర్ల మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను భారత్, రష్యా కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయాన్ని చైనా నిర్మించడం గమనార్హం.
Maldives: మాల్దీవుల్లోకి చైనా రీసెర్చ్ షిప్ మళ్లీ వచ్చింది. రెండు నెలల క్రితం ఇది మాల్దీవుల్లోని పలు రేవుల్లో తిరిగింది. ప్రస్తుతం ఇది మళ్లీ ద్వీప దేశ జలాల్లోకి వచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిబాంగ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే జాతీయ రహదారి 33లో కొంత భాగం కొట్టుకుపోయింది.
చైనాలోని దక్షిణ ప్రావిన్స్లోని గ్వాంగ్డాంగ్లో భారీ వర్షం కురిసి, ఆ ప్రాంతం చెరువులా మారింది. గత 65 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాల కారణంగా 4గురు చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు.
China: చైనా కుంగిపోతోంది. ఆ దేశంలోని పలు ప్రాంతాలు కొన్నేళ్లుగా కుంగిపోతున్నట్లు తేలింది. చైనాలోని పట్టణ జనాభాలో దాదాపుగా మూడింట ఒక వంతు మంది ప్రమాదంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
బలమైన సైనిక వ్యవస్థతో పాటు ఇప్పటికే పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నా డ్రాగన్ కంట్రీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మిలిటరీ బలోపేతంలో భాగంగా మరో కొత్త సైన్యాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చూట్టింది.
BrahMos: భారత్ తన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్ ఆర్డర్ చేసిన బ్రహ్మోస్ లాంచర్లను, క్షిపణులను రేపటి నుంచి సరఫరా చేయనుంది.