ఎవరైనా అపస్మారక స్థితికి వెళ్లిన, గుండెపోటు వచ్చిన చికిత్స అందించడం ఏ మాత్రం ఆలస్యం చేయకుడదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. వ్యాధిగ్రస్థుని ఛాతిని నొక్కడం, నోటితో శ్వాస ఇవ్వడం వంటివి చేయాలి. అపస్మారక స్థితిలోకి జారుకున్న ఓ జంతువును కాపాడేందుకు ఓ మహిళ సాహసం చేసింది. అసలేం జరిగిందంటే..
మామూలుగా పందులు అంటేనే అసహించుకుంటాం. వానికి చూస్తేనే కంపరంగా ఫీల్ అవుతుంటాం. కాని ఓ మహిళ అలాంటి పంది నోట్లో నోరు పెట్టి సీపీఆర్ చేసింది. దాన్ని బ్రతికించేందుకు ప్రయత్నించింది. చైనాకు చెందిన జాంగ్ అనే మహిళ తన ఇంట్లో పెంచుకునేందుకు రెండు పందులను కొనుగోలు చేసింది. వాటిని కారులో తీసుకెళ్తుండగా.. వాటిలో ఒకటి ఎండ, ట్రాఫిక్ మధ్యలో విపరీతమైన వేడి కారణంగా స్పృహతప్పి పడిపోయింది. దాని ప్రాణాలను కాపాడాలని మహిళ ప్రయత్నించింది. దాన్ని రోడ్డు పక్కన తీసుకెళ్ళి సీపీఆర్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే, ఈ ప్రయత్నం పందిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. చివరికి అది మరణించింది. చైనాలోని హుబీ ప్రావిన్స్‌లోని జింగ్‌మెన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ లో జనాలు ఆమెను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.