చైనాలోని హుబీ ప్రావిన్స్ లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కడుపులో వృషణాలు ఉన్నాయని వైద్య పరీక్షల్లో తేలింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హుబీ ప్రావిన్స్ కు చెందిన ఓ యువతి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. కొన్ని రోజుల్లోనే తన వివాహం ఉండగా.. తన పొట్టలో వృషణాలున్నాయని తేలడంతో కంగుతింది. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించారు. అయితే. ఆ యువతి పుట్టుకతో వచ్చే అడ్రినల్ గ్రంథి వ్యాధితో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
READ MORE: Sai Dharam Tej: మెగా హీరోపై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం..
18 ఏళ్ల వయసప్పుడు అసాధారణ హార్మోన్లు ఉన్నాయని తేలగా.. ఆమె యవ్వనంలో అడుగు పెట్టినప్పటి నుంచి స్తనాల పెరుగుదల సరిగ్గా లేదని నిర్ధారించారు. దీంతో ఆమెకు క్రోమోజోముల పరీక్ష చేయించాలని వైద్యులు సూచించారు. అయితే యువతి తల్లిదండ్రులు దాని పెడచెవిన పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ లో పెండ్లి కి ముందు వైద్య పరీక్షలు చేయించగా.. తమ కూతురు పురుషుడన్న విషయం వారికి తెలిసి వచ్చింది. దీంతో వాళ్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆఫరేషన్ ద్వారా వృషణాలను తొలగించారు వైద్యులు.