కరోనా మహమ్మారి చైనా నుంచి ప్రపంచానికి వ్యాపించిందని వివిధ దేశాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ అభివృద్ధి కుదేలైంది. జీ7, నాటో దేశాలు చైనాపై విమర్శలు చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, చైనా నుంచి ఇప్పుడు మరో విపత్తు ముంచుకొచ్చే అవకాశం ఉన్నది. చైనాలోని దక్షిణ గాంగ్‌డాంగ్ ప్రావిన్స్ లోని తైషాన్ అణువిద్యత్ కేంద్రం నుంచి రేడియోధార్మిక గ్యాస్ లీక్ అవుతుందని, ఇది మరో విపత్తుగా మారే అవకాశం ఉందని అమెరికా సీక్రెట్ సర్వీసెస్ పేర్కొన్నది. గత రెండు వారాలుగా ఈ గ్యాస్ లీకవుతున్నట్టు సీక్రెట్ సర్వీసెస్ తెలిపింది. ఈ అణువిద్యుత్ ప్లాంట్‌లో ప్రాన్స్ కు చెందిన ప్రామటోమ్‌కు భాగస్వామ్యం ఉన్నది. లీకేజీ విషయాన్ని అమెరికాకు ఈ భాగస్వామ్య సంస్థ సమాచారం అందించింది. జూన్ 3, జూన్ 8 వ తేదీన ఈ సంస్థ అమెరికాకు సమాచారం అందించింది. ఇది విపత్తుగా మారకముందే విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని కొరినా చైనా యాజమాన్యం అందుకు నో చెప్పడంతో సమస్య మరింత జఠిలంగా మారే అవకాశం ఉన్నది. గ్యాస్ ల్ ప్రమాదభరితమైన వాయువులు లేవని చైనా వాదిస్తోంది.