చైనా పేరు చెబితేనే ప్రపంచం భయపడిపోతున్నది. చైనాలో కొత్తకొత్త వైరస్‌లు బయటపడుతున్నాయి. రీసెంట్‌గా మరో నాలుగు కొత్త కరోనా వైరస్‌లు బయటపడ్డాయి. ప్రపంచం కరోనాతో ఇబ్బందులు పడుతుంతే, చైనా మాత్రం అభివృద్ది దిశగా పరుగులు తీస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, ఈ రోజు చైనాలో ఘోరప్రమాదం జరిగింది. చైనాలోని హుబే ప్రావిన్స్ వద్ద గ్యాస్‌పైప్ లైన్ పేలింది. ఈ పేలుళ్లలో 11 మంది మృత్యవాత పడ్డారు. మరో 37 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.