చైనా దేశంపై అమెరికా మరోమారు ఉక్కుపాదం మోపింది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం కావడానికి చైనా వైరస్ కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించడంతోపాటు, 31 చైనా కంపెనీలపై నిషేదం విధించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత, చైనాతో సత్సంబందాలు కొనసాగుతాయని అనుకున్నారు. అ దిశగానే బైడెన్ అడుగులు వేసినా, తాజా పరిణామాలతో మరోసారి చైనాపై బైడెన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. చైనాకు చెందిన 28 కంపెనీలపై నిషేదం విధించింది. బైడెన్ ఆరు నెలల కాలంలోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో చైనా సర్కార్ షాక్ అయింది. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలు నిఘా కార్యక్రమాల్లో పాల్గోంటున్నాయని, చైనా సైన్యంతో కలిసి పనిచేస్తున్నాయని, ఆగస్టు 2 నుంచి ఈ నిషేదం అమలులోకి వస్తుందని బైడెన్ సర్కార్ పేర్కొన్నది.