అమెరికా మాజీ అధ్యక్షుడు, అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా వివమర్శలు ఎదుర్కొన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తెరపైకి వచ్చారు.. కరోనా వైరస్ పుట్టిక గురించి ఆది నుంచి చైనాపై ఆరోపణలు చేస్తున్న ఆయన.. ఓ దశలో అది చైనా వైరస్ అంటూ కూడా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే..అయితే, చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే కోవిడ్ వైరస్‌ను సృష్టించారంటూ ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొన్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై స్పందించిన ట్రంప్.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పుట్టుకపై తాను ముందు చెప్పిందే నిజమైందన్నారు.. మహమ్మారిని సృష్టించి ఇంతటి విధ్వంసానికి పాల్పడినందుకు డ్రాగన్ కంట్రీ.. భారీ మూల్యం చెల్లించకతప్పదన్న ఆయన.. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని అప్పుడు ట్రంప్ చెప్పింది నిజమేనని ఇప్పుడు శత్రువులతో సహా అందరూ అంటున్నారని.. లక్షల మరణాలు, ఊహించని విధ్వంసానికి కారణమైన చైనా.. యూఎస్‌తో పాటు ప్రపంచ దేశాలకు పది ట్రిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, చైనాలో పుట్టింది.. వూహాన్ ల్యాబ్‌లోనే కరోనా పురుడుపోసుకుంది అనే వాదనలు ఉన్నా.. కొన్ని అధ్యయనాలు ఆ విషయాన్ని చెబుతున్నా.. ఇప్పటికీ.. దానిపై క్లారిటీ లేని విషయం తెలిసిందే. ఇక, కరోనా కొత్త కొత్త వేరింయట్లు ప్రజలను వణకిస్తూనే ఉంది.